https://oktelugu.com/

KTR: ఎవనిది రా కుట్ర.. సీఎం రేవంత్ ను పట్టుకొని అంతా మాట అనేసిన కేటీఆర్

సోషల్ మీడియాలో కేటీఆర్ రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

Written By:
  • Rocky
  • , Updated On : November 14, 2024 / 02:04 PM IST

    Revanth Reddy-KTR

    Follow us on

    KTR: లగచర్లలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఓ ఫార్మా కంపెనీకి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేయడం తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు రావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారేమోనన్న ప్రచారం సాగుతోంది.

    కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడి చేసిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు 14 పట్నం నరేందర్ రెడ్డికి రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు నేడు మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడు, మరో ముగ్గురు కూడా ఉన్నారు. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేటీఆర్ స్పందించారు.

    సోషల్ మీడియాలో కేటీఆర్ రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్ సారాంశాన్ని యథావిధిగా క్రింద చూడవచ్చు.. ‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అని.. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేమో నీ అల్లుడి కోసమో, అన్న కోసమో… రైతన్నల నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. నీవద్ద ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అన్నారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! అని నిప్పులు చెరిగారు. మీకు మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అని నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! అని కేటీఆర్ అన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!! జై తెలంగాణ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.