
Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ మహానటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మలయాళం నుంచి దిగుమతి అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. గొప్పగా నటిస్తుంది. హావభావాలు పలికిస్తుంది.. ఇప్పటివరకు పెద్దపెద్ద స్టార్లతో సినిమాలు చేసినప్పటికీ ఏమాత్రం హిపోక్రసీ ప్రదర్శించదు. త్వరలో నానితో నటించిన దసరా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక ఈ నటిమణి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటుంది.. తనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.
ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉండే కీర్తి సురేష్… అందుకు సంబంధించి వివిధ ఆసనాలను, యోగ ప్రక్రియలను అభిమానులతో పంచుకుంటుంది. వీడియోలు కూడా చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఎవరూ చేయని శారీరక యోగాభ్యాసానాన్ని కీర్తి సురేష్ చేసింది. ఇంట్లో చుట్టూ అందమైన వాతావరణం.. పచ్చిక బయలు ఉన్న ప్రాంతంలో తన పెంపుడు కుక్కను పక్కన పెట్టుకొని… వివిధ రకాల ఆసనాలు వేసింది. రెండు చేతులను భూమికి ఆనించి చేతులను ఓడుపుగా కదుపుతూ శరీరాన్ని రోలర్ కోస్టర్ లా తిప్పేసింది.

సాధారణంగా ఇటువంటి అభ్యాసనాలను యోగాలో బాగా ప్రావీణ్యం ఉన్నవారు చేస్తారు. దీనివల్ల వెన్నునొప్పులు తగ్గుతాయి.. శరీరానికి దృఢత్వం పెరుగుతుంది. ఎముకలు గట్టి పడతాయి. అన్నింటికీ మించి శరీరం నాజూగా మారుతుంది.. దేశ సరిహద్దుల్లో కాపలాగా ఉండే సైనికులకు ఇలాంటి అభ్యసనలను నేర్పిస్తుంటారు. ఇక ఈ యోగ అభ్యసనాన్ని ప్రదర్శిస్తూ” చుట్టు పచ్చని చెట్లు ఉన్నాయి.. అంతకంటే అందమైన పచ్చిక బయలు ఉన్నది.. ఈ మనోహరమైన ప్రకృతిలో శరీరాన్ని ఇలా వంచుకుంటూ వెళ్తుంటే బాగుంటుందని” కీర్తి సురేష్ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకోచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram