Viral Photo : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. సినిమాలోని కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలు అయిన చేయడానికి రెడీగా ఉంటుంది ఈ బ్యూటీ. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈమెను గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ముద్దుగుమ్మలలో ఈమె కూడా ఒకరు. ఈమె తెలుగుతోపాటు తమిళ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. మనం చెప్పుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్. ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని జోడిగా కీర్తి సురేష్ నేను శైలజ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నేను శైలజ అనే మొదటి సినిమాతోనే హీరోయిన్ గా కీర్తి సురేష్ తన అందం తో , అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమా లో ఆమె నటన బాగుండడంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి.ఆ తర్వాత తెలుగులో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.మహానటి సినిమాలో కీర్తి సురేష్ చాల అద్భుతంగా నటించింది అని చెప్పడంలో సందేహం లేదు.టాలీవుడ్ సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించి ఒదిగిపోయింది.
ఈ సినిమాకు గాను ఆమె నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే ఎన్నమాయం అనే సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఈమె తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో అనేక సినిమాలలో నటించి మెప్పించింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన రఘు దత్త సినిమాలో నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కు అదృష్టం కలిసి రాలేదు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి టాలీవుడ్, హాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో అందరిని ఆకట్టుకున్నాయి.
