Keerthy Suresh : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్. అందంతో పాటు, అద్భుతమైన నటన కనబర్చే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. ‘మహానటి’ చిత్రంలో అద్భుతంగా నటించి, ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నంగా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. కీర్తి సురేష్ ఒక సినిమాకి సంతకం చేసిందంటే కచ్చితంగా అందులో విషయం ఉంది అని జనాలు నమ్మే రేంజ్ ఇమేజ్ ని దక్కించుకుంది. అయితే ఈమెపై కూడా అనేక రూమర్స్ వచ్చేవి. తమిళంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం నడుపుతుందని, అదే విధంగా తమిళ హీరో విజయ్ తో కూడా డేటింగ్ చేస్తుందని , ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి.
కానీ వాటి అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈమె గత ఏడాది డిసెంబర్ 12 వ తారీఖున తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ని పెళ్లి చేసుకొని ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది. పెళ్లి కొడుకు క్రిస్టియన్ మతానికి చెందిన వాడు, కీర్తి సురేష్ హిందూ మతానికి చెందిన అమ్మాయి. అందుకే రెండు సంప్రదాయాలతో వేర్వేరుగా ఈ వివాహాన్ని జరుపుకున్నారు. పెళ్ళైన తర్వాత ఈమె నుండి ‘బేబీ జాన్’ అనే బాలీవుడ్ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ సమయంలో కీర్తి సురేష్ మోడరన్ దుస్తుల్లో తాళి బొట్టు ధరించి అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. మోడరన్ అమ్మాయి అయినప్పటికీ కూడా, సంప్రదాయాలను అనుసరించినందుకు కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో భర్త కలిసి దిగిన ఫోటోలను కొన్ని అప్లోడ్ చేసింది.
ఈ ఫోటోలలో ఎక్కడ కూడా ఆమె మెడలో మంగళసూత్రం కనిపించదు. దీనిని చూసి నెటిజెన్స్ పెళ్ళైన రెండు నెలలకే తాళిబొట్టు తీసేసావా?, మొన్న మాత్రం ప్రొమోషన్స్ కోసం పసుపు తాడు మెడలో వేసుకొని తిరిగావెందుకు..?, బిల్డప్ కోసమా అంటూ కీర్తి సురేష్ ని ఏకిపారేస్తున్నారు నెటిజెన్స్. హీరోయిన్స్ సంప్రదాయాల గురించి గొప్పగా మాట్లాడుతూ, వాటిని అనుసరించకపోవడం ఈమధ్య కాలం లో అలవాటు అయిపోయింది. కోట్లాది మంది ఆదర్శంగా నిలిచే ఇలాంటోళ్ళు ఇక నుండైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం అక్క అని వెబ్ సిరీస్ లో నటించింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో రాధికా ఆప్టే కూడా కీలక పాత్ర పోషించింది. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.