https://oktelugu.com/

Star Heroine: బాలీవుడ్ గాలి సోకిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసిన స్టార్ హీరోయిన్…

నాని హీరోగా వచ్చిన 'దసరా' సినిమాతో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 26, 2024 / 12:07 PM IST

    Keerthy Suresh raises glamour dose

    Follow us on

    Star Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కీర్తి సురేష్ తెలుగుతోపాటు తమిళంలో కూడా వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నాని హీరోగా వచ్చిన ‘దసరా’ సినిమాతో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక వరుణ్ ధావన్ హీరోగా ‘బేబీ జాన్’ అనే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది…

    తెలుగు సినిమాల్లో పదహారణాల తెలుగమ్మాయిల కనిపించిన కీర్తీ సురేష్ ఈ సినిమా కోసం తన గ్లామర్ డోస్ ని పెంచినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక ఫోటోను చూస్తే అది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రెగ్యులర్ గా తను ఇన్ స్టా లో కూడా తన గ్లామరేస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తన అభిమానులకు కన్నుల విందు చేస్తుంది. నిజానికి తను ఒక్కసారిగా ఇలాంటి గ్లామర్ పిక్స్ ని షేర్ చేయడానికి గల కారణం ఏంటి అంటే తను బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. కాబట్టి తన అందాల విందుతో ఎలాగైనా సరే అక్కడే సెటిలవ్వాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇంతకు ముందు తను సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసిన ‘మహానటి ‘ సినిమాలో అచ్చం సావిత్రి లాగే కనిపించి ప్రేక్షకులను మైమరిపింపజేసింది. అలాగే ఆ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు ‘నేషనల్ అవార్డు’ కూడా రావడం విశేషం… మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆమె గ్లామరస్ పాత్రలు చేస్తుంటే తన అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు తగ్గట్టుగా అప్డేట్ అయితేనే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలుగుతాం కాబట్టి తను కూడా అలాంటి అప్డేట్ ను కోరుకునే అందాల విందు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ‘బేబీ జాన్’ సినిమా తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తేరీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది…

    ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా వరుణ్ ధావన్ బర్త్ డే సందర్భంగా షూటింగ్ బ్రేక్ టైం లో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా చేశారట. అప్పుడు దిగిన ఒక ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక మొత్తానికైతే కీర్తి సురేష్ బాలీవుడ్ ప్రేక్షకులను తన అందం తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతుందనే చెప్పాలి…