‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ మొదటిసారి గ్లామర్ డోస్ లో తన పరిధి పెంచబోతుంది. ఆమె సీన్స్ కాస్త రొమాంటిక్ టోన్ లో సాగుతాయి. అందుకు తగ్గట్టుగానే కీర్తి కూడా కాస్త ఎక్స్ పోజింగ్ విషయంలో పెద్ద మనసు చేసుకుంది. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా చక్కగా దర్శకుడు కోరినట్టు చేసుకుంటూ పోయింది. దీంతో కీర్తి సురేష్ తో మహేష్ రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వచ్చాయట.
నిన్న రిలీజ్ అయిన టీజర్ ను చూస్తేనే మహేష్ బాబు – కీర్తి సురేష్ మధ్య ఏ రేంజ్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందో అర్థమవుతుంది. పైగా తన ‘సర్కారు వారి పాట’లో రొమాంటిక్ ట్రాక్ ను చాలా ఇంట్రెస్ట్ తో తనలోని రొమాంటిక్ ఫీల్ ను అంతా గుమ్మరించి రోజుల తరబడి గమ్మున కూర్చుని రాశాడట పరుశురామ్. ఎలాగూ దర్శకుడు పరశురామ్ రొమాంటిక్ సీన్లు సూపర్ గా తీస్తాడు.
అలాగే రొమాంటిక్ డైలాగులు రాయడంలో కూడా పరుశురామ్ దిట్ట. “గీత గోవిందం” సినిమాలో చూశాం కదా.. ఒక చిన్న ముద్దు చుట్టూ కథను నడిపి.. 100 కోట్లు కలెక్ట్ చేశాడు. పైగా ‘గీతగోవిందం’ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా కూడా ‘సర్కారు వారి పాట’నే. కాబట్టి.. ఆ ముద్దు తాలూకు విజయం ఇచ్చిన ఉత్సాహం పరుశురామ్ లో ఇంకా పుష్కలంగా ఉంది.
అందుకే, ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ అన్నీ బాగా కుదిరేలా తీశాడట. ఇక మహేష్ బాబు లోన్లు వసూళ్లు చేసే కంపెనీని నడిపే వ్యక్తిగా నటిస్తే.. కీర్తి సురేష్ ఆ కంపెనీలో పనిచేసే తెలుగు అమ్మాయిగా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు కళావతి. ఆమెను మహేష్ ‘కళావతి నా మతి దొబ్బకు’ అంటూ ఆఫీస్ లో తరుచూ అంటూ ఉంటాడట.
ఇక అఫీస్ రొమాన్స్ అయితే, సినిమాకే హైలెట్ గా ఉండనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఉంది.