https://oktelugu.com/

Keerthi Suresh: కీర్తి సురేష్ అభిమానులకు బాడ్ న్యూస్… “గుడ్ లక్ సఖి” విడుదల వాయిదా

Keerthi Suresh: ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్,  మిస్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 16, 2021 / 10:13 AM IST
    Follow us on

    Keerthi Suresh: ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్,  మిస్ ఇండియా  సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

    కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ న‌టిస్తోన్న చిత్రం ” గుడ్ లక్ సఖి “. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న ఈ సినిమాని విడుదల చేస్తామని చిత్ర బృందం  ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు వెల్లడించారు. ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో  ‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అని తెలిపారు.

    https://twitter.com/WorthAShotArts/status/1460223157361512455?s=20

    ఈ సినిమా ప్రేక్షకులందరికి అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామని అన్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు.  ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.