JD Lakshminarayana wife was cheated: సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు తడి గుడ్డతో గొంతు కోసే విధంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి .. వారు చెప్పినట్టు చేస్తే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు, సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలలో ఉన్న డబ్బును మొత్తం ఊడ్చేస్తారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారి జాబితా చాలానే ఉంటుంది. అయితే ఇందులో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఊర్మిళ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఊర్మిలకు ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు చెప్పింది నిజమని నమ్మింది. సరిగ్గా గత ఏడాది ఊర్మిళ వాట్స్అప్ కు ఒక నెంబర్ తో స్టాక్ మార్కెట్ లింక్ వచ్చింది. తాము చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేస్తే 500 శాతం ప్రాఫిట్స్ వస్తాయని ఆ ప్రకటనలో ఉంది. ఆ ప్రకటనను నిజమని నమ్మిన ఊర్మిళ 2.58 కోట్లు విడుదలవారీగా పెట్టుబడి పెట్టింది.
ట్రేడింగ్ మీద అవగాహన లేకపోయినప్పటికీ భర్త లక్ష్మీ నారాయణ సహాయం తీసుకొని ఆమె పెట్టుబడి పెట్టింది. 2.58 కోట్లు ఆమె పెట్టుబడి పెడితే.. రెండు కోట్ల లాభం వచ్చిందని సైబర్ నేరగాళ్లు ఆమెకు ఆశ చూపించారు. అయితే ఆ డబ్బులు విత్ డ్రా చేసుకుంటే మరి కొంత సొమ్ము చెల్లించాలని ఫైబర్ నేరగాళ్లు చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించింది. దీంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఫోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డ వారంతా పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని గుర్తించారు. వారిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. విచారిస్తున్నారు. వారు నగదు లావాదేవీలకు ఉపయోగించిన ఖాతాలను సైబర్ పోలీసులు ఫ్రీజ్ చేశారు.
సైబర్ పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేయడంతో నేరగాళ్ల బాగోతం బయటపడింది. లక్ష్మీనారాయణ భార్య మోసపోయిన తీరు ఇప్పుడు సెలబ్రిటీలకు ఒక గుణపాఠం లాగా మారింది. వాస్తవానికి ఎందులో కూడా పెట్టుబడి పెట్టినా ఆ స్థాయిలో లాభాలు రావడం సాధ్యం కాదు. కానీ ఈ విషయాన్ని ఒక ఉన్నత విద్యావంతురాలు అయిన ఊర్మిళ మర్చిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సైబర్ నేరగాళ్లు ఆకాశంలో స్వర్గం చూపిస్తుంటారు. దానిని నిజమని నమ్మితే ఇదిగో ఇలానే మోసపోవాల్సి వస్తుంది.
మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్
ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ
ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ… https://t.co/yivIBsRoJJ pic.twitter.com/qX6d4jRNPY
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2026