https://oktelugu.com/

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ భార్యకు ఆ హీరో అంటే చాలా ఇష్టం, ఎవరో తెలుసా? స్టార్ అనుకుంటే పొరపాటే

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఆ హీరో అంటే చాలా ఇష్టం అట. ఆయన ఒక స్టార్ హీరో కాదు. నందమూరి హీరో అసలు కానే కాదు. పైగా ఆ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ భార్యకి ఫేవరేట్ హీరో అట. అంతగా స్టార్ కపుల్ ని ఆకట్టుకున్న హీరో ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : December 25, 2024 / 04:33 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR: ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్ చరణ్ మరో హీరోగా నటించారు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నటించిన దేవర సైతం భారీ విజయం సాధించింది. ఈ మూవీ రూ. 500 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ అధిగమించాడు. బాలీవుడ్ లో సైతం ఓ మోస్తరు విజయం దేవర నమోదు చేసింది. రూ. 60 కోట్ల కలెక్షన్స్ హిందీ వెర్షన్ కి వచ్చాయి.

    ఎన్టీఆర్ లైన్ అప్ భారీగా ఉంది. ప్రస్తుతం వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల ఈ మల్టీస్టారర్ పై భారీ హైప్ ఉంది. ఎన్టీఆర్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ చిత్రం వార్ 2. దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ కూడా పట్టాలెక్కనుంది. సలార్ 2 మూవీ కూడా పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీకి సిద్ధం అవుతున్నాడు. ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథను ప్రశాంత్ నీల్ రాశారట.

    ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ తరం హీరోల్లో తనకు ఓ హీరో యాక్టింగ్ ఇష్టమని ఆయన అన్నారు. హీరో రానా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ జనరేషన్ హీరోల్లో నీకు ఎవరు ఇష్టమని అడగ్గా… ఒక్కొక్కరు ఒక్కో విషయంలో నాకు నచ్చుతారు. మహేష్ బాబు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఇక బాహుబలి మూవీలో నీ డైలాగ్స్ చూసి నేను ఫ్యాన్ అయ్యాను అన్నారు.

    ఇక హీరో నాని నటన అంటే నాకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ తెలియజేశారు. అలాగే తన భార్య లక్ష్మి ప్రణతికి కూడా నాని ఫేవరెట్ హీరో అని వెల్లడించారు. ఒక స్టార్ హీరో భార్య అందులోనూ ఎన్టీఆర్ వంటి గొప్ప పెర్ఫార్మర్ సతీమణి.. మరొక హీరోని ఇష్టపడటం గొప్ప విషయం. నాని టాలెంట్ కి ఇది నిదర్శనం. నాని నేచురల్ యాక్టింగ్ ని చాలా మంది సెలెబ్స్ ఇష్టపడతారు.