https://oktelugu.com/

Kaushik : ఎన్టీఆర్ వద్ద సహాయం పొంది వెన్నుపోటు పొడిచే ప్రయత్నం..అండగా నిలబడిన ఫ్యాన్స్ పై కేసు వేస్తానంటూ బెదిరిస్తున్న కౌశిక్ తల్లి!

మంచి కి కాలం కాదని పెద్దలు అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది. ఒక మనిషి మంచి కోరి సాయం చేస్తే, అదే మంచి తిరిగి మనకి వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 09:14 AM IST

    Kaushik

    Follow us on

    Kaushik : మంచి కి కాలం కాదని పెద్దలు అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు చూసినప్పుడు అది నిజమే కదా అనిపిస్తుంది. ఒక మనిషి మంచి కోరి సాయం చేస్తే, అదే మంచి తిరిగి మనకి వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మన నుండి లాభం పోండినోళ్లు, కృతజ్ఞత లేకుండా తిరిగి మనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సంఘటన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయం లో జరుగుతుంది. గత కొద్దీ నెలల క్రితం ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. చనిపోయే పరిస్థితి లో ఉన్నానని, తానూ చనిపోయే లోపు ‘దేవర’ చిత్రం చూడాలని ఉంది అంటూ కోరికని వ్యక్తం చేయడం, ఆ వీడియోని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు షేర్ చేసి వైరల్ చేయడం వంటివి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

    ఎన్టీఆర్ కౌశిక్ కి స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఏడుస్తున్న అతని తల్లికి కూడా ధైర్యం చెప్పి, తన మ్యానేజర్ కి ఆ అబ్బాయి వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు చూసుకోమని చెప్పాడు. అయితే విషయం బాగా వైరల్ అవ్వడం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 11 లక్షల రూపాయిలు ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే టీటీడీ వాళ్ళు కూడా స్పందించి 40 లక్షల రూపాయిలను అబ్బాయి వైద్యం కోసం ఖర్చు చేసారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా రెండున్నర లక్షల రూపాయిలు కలెక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు కౌశిక్ క్యాన్సర్ బరి నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు. అయితే అతను డిశ్చార్జ్ అవ్వడానికి హాస్పిటల్ వాళ్ళు 20 లక్షల రూపాయిలు మెడికల్ బిల్స్ ని కట్టాలని చెప్పారట. దీంతో కౌశిక్ తల్లి మళ్ళీ ఎన్టీఆర్ మ్యానేజర్ కి ఫోన్ చేస్తే ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పాడట.

    దీంతో కౌశిక్ తల్లి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ‘ఎన్టీఆర్ తనకి సహాయం చేస్తానని మాటిచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’ అంటూ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం ప్రారంభించింది. దీనికి అభిమానులు సోషల్ మీడియా లో కౌంటర్ ఇస్తుంటే, వాళ్లపై కేసులు పెడతాను అంటూ బెదిరిస్తోంది. కౌశిక్ సమస్య ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చెయ్యడం వల్లే ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరింది. ఎన్టీఆర్ స్వయంగా రెస్పాన్స్ ఇచ్చి కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడం వల్లే, ప్రభుత్వం, టీటీడీ నుండి రెస్పాన్స్ వచ్చి సహాయం చేసారు. నేడు ఆ అబ్బాయికి ఏమి కాకుండా సురక్షితంగా ఉన్నదంటే అందుకు కారణం ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులు. అలాంటి వాళ్లపై ఇలాంటి ఆరోపణలు, బెదిరింపులా?..ఇదెక్కడి న్యాయం , మంచి కోసం నిలబడితే చెడు ఎదురు అవ్వడం అంటే ఇదే.