Kaushal’s Shocking Comment: ఉదయ్ కిరణ్(Uday Kiran)..ఈ పేరు వింటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎంతో మంచి టాలెంట్ ఉన్న హీరో, కెరీర్ లో ఎంతో ఉన్నతమైన స్థానం లో ఉండాల్సిన వ్యక్తి. కానీ జీవితం లో ఎదురైనా సంఘటనలను ఎదురుకోలేక మానసికంగా కృంగిపోయి ప్రాణాలను తీసుకున్న ఘటన తల్చుకుంటే ప్రతీ తెలుగోడు కన్నీటి పర్యంతం అవుతాడు. ‘చిత్రం’ తో వెండితెర అరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్,ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. దీంతో టాలీవుడ్ లో క్రేజీ దర్శక నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయడానికి క్యూలు కట్టారు. కొన్ని సినిమాలు మొదలై మధ్యలోనే ఆగిపోయాయి. కేవలం ఇంకో పది శాతం షూటింగ్ పూర్తి అయితే సినిమా అయిపోతుంది అనుకున్న సినిమాలు కూడా ఆగిపోయాయి. ఒక మనిషికి ఇలాంటివి జరిగితే ఎంతటి మానసిక వేదన ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: హరి హర వీరమల్లు’ రన్ టైం ఇంతేనా..? ఈమధ్య కాలంలో చాలా అరుదు!
ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో మళ్ళీ రాణించేందుకు ఉదయ్ కిరణ్ ప్రయత్నాలు చేశాడు. కానీ మెరుగైన ఫలితాలు రాలేదు. భార్య సంపాదన మీద బ్రతకాల్సిన పరిస్థితి. భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు రావడం సహజం. అలా ఉదయ్ కిరణ్ కి తన భార్య తో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. ఒక రోజు పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఓటీటీ వృద్ధిలోకి వచ్చింది. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండుంటే ఆయనకు కచ్చితంగా ఎన్నో అవకాశాలు వచ్చి ఉండేవి. ఇదంతా పక్కన పెడితే ఉదయ్ కిరణ్ కి అత్యంత ఆప్తులలో ఒకరు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్(Kaushal Manda). ఉదయ్ కిరణ్ తో కలిసి ఆయన 12 సినిమాల్లో నటించాడు. అలా ఆయనకు అతనితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
Also Read: అల్లు అర్జున్,అట్లీ చిత్రంలో విలన్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కౌశల్ ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘ఉదయ్ కిరణ్ హీరో అవ్వకముందు నుండే నాకు బాగా తెలుసు. చిత్రం సినిమాకి ముందు ఉదయ్ కిరణ్ జీవితం లో చాలా ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ నాకు బాగా తెలుసు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఉదయ్ కిరణ్ చనిపోయి మంచి పని చేసాడని అనను కానీ,ఇలాంటి సమాజం లో బ్రతకడం కూడా వృధా అని నేను అంటాను. ఒక మనిషి జీవితం లో పైకి వెళ్తున్నా, ఒక మనిషి కెరీర్ లో విజయం సాధించినా, ఆ మనిషిని క్రిందకు లాగడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి. అలా క్రిందకి లాగడం వల్ల ఆర్థికంగా వాళ్లకి ఏమైనా లాభం చేకూరుతుందా అంటే అది కూడా లేదు, ఒక రకమైన ఆనడం పొందుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో చూడండి.