India vs England Test Series : రెండవ టెస్టు మ్యాచ్లో గెలిచిన నేపథ్యంలో టీమిండియా ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మొదలుకానుంది. ఈ టెస్ట్ గెలిచి సిరీస్ లో ముందడుగు వేయాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. మూడో టెస్టు కు జట్టులోకి బుమ్రా వస్తాడని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గిల్ ప్రకటించాడు. మొదటి టెస్ట్ లో బుమ్రా నిర్విరామంగా బౌలింగ్ వేశాడు. దీంతో అతనికి రెండవ టెస్టులో విశ్రాంతి ఇచ్చారు. రెండో టెస్టులో మహమ్మద్ సిరాజ్ అవిశ్రాంతంగా బౌలింగ్ వేశాడు. ఆకాష్ కూడా అదే స్థాయిలో బౌలింగ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్.. రెండవ ఇన్నింగ్స్ లో ఆకాష్ అదరగొట్టారు. ఇంగ్లాండ్ జుట్టు టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించారు..
రెండవ టెస్టులో మహమ్మద్ సిరాజ్ దాదాపు 32 ఓవర్లు వేశాడు. అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. నిర్విరామంగా బౌలింగ్ వేయడంతో అతడు అలసిపోయాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.. దీంతో అతనిపై వర్క్ లోడ్ అధికంగా పడకూడదని మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే అతడిని మూడో టెస్టుకు విశ్రాంతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ జట్టులోకి బుమ్రా వస్తున్న నేపథ్యంలో.. సిరాజ్ స్థానంలో బుమ్రా ను తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ప్రసిధ్ కృష్ణను మూడవ టెస్టులో కూడా జట్టులో కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మొదటి టెస్టులో ప్రసిధ్ వికెట్లు పడగొట్టినప్పటికీ దారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇక రెండవ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా పరుగులు ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. పరుగులు వేయకుండా ఇంగ్లాండు బ్యాటర్లను కట్టడి చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో మెరుగ్గా బౌలింగ్ చేసిన నేపథ్యంలో.. లార్డ్స్ టెస్టులో ప్రసిధ్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. స్పిన్ విభాగంలో కులదీప్ యాదవ్ కు చోటు ఇవ్వచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రెండవ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యాడు. బ్యాటింగ్లో తేలిపోయాడు. బౌలింగ్లో చేతులెత్తేశాడు. దీంతో అతడి స్థానంలో కులదీప్ కు చోటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
తొలి టెస్ట్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెండవ టెస్టులో విశ్రాంతి ఇచ్చాడు. ఇక మూడో టెస్టులో సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చి బుమ్రాను జట్టులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ప్రసిధ్ కృష్ణ విషయంలో మేనేజ్మెంట్ ఏమైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే అర్ష్ దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి రెండో టెస్టులోనే అతడు జట్టులోకి ప్రవేశిస్తాడని అనుకున్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల అతడి ఎంట్రీ సాధ్యం కాలేదు. ఒకవేళ మూడో టెస్టులో ప్రసిధ్ కు కనుక రిక్తహస్తం చూపిస్తే ఖచ్చితంగా అర్ష్ దీప్ సింగ్ కు లో చోటు లభిస్తుంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ తొలి టెస్ట్ లో ఏకంగా 41 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. రెండో టెస్టులో 32 ఓవర్ల పాటు బౌలింగ్ వేసాడు. ఈ స్థాయిలో అతడు బౌలింగ్ వేయడంతో తీవ్రంగా అలసిపోయాడు. అందువల్లే అతడికి మూడవ టెస్టులో విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిస్తోంది.