Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu OTT- Kaushal Manda: ప్రతీసారీ నేను చెప్పిన వారే గెలిచారు..: ఈసారి...

Bigg Boss Telugu OTT- Kaushal Manda: ప్రతీసారీ నేను చెప్పిన వారే గెలిచారు..: ఈసారి విన్నర్ ఎవరంటే: కౌశల్

Bigg Boss Telugu OTT- Kaushal Manda: బిగ్ బాస్ నాన్ స్టార్ విన్నర్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారమైన ఈ షో మొదటిసారిగా ఓటీటీ వేదికగా సాగింది. ఈ సీజన్లో విన్నయ్యేవాళ్లు ఓటీటీ మొదటి విజేతగా రికార్డల్లోకెక్కుతారు. ఇప్పటికే బిందుమాధవి, అఖిల్ సార్థక్ పేర్లు పోటా పోటీగా ప్రచారం సాగుతున్నాయి. మరోవైపు బిందుమాధవి పేరును విజేతగా ప్రకటించారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానెల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా విన్నర్ ఎవరో ముందే చెప్పేశాడు.

Bigg Boss Telugu OTT- Kaushal Manda
Kaushal Manda

బిగ్ బాస్ తెలుగు షోల్లో అత్యధిక ఓటింగ్ శాతం సంపాదించుకున్న వారిలో కౌశల్ మందా ఒకరు. బిగ్ బాస్ 2 ఫైనల్ సమయంలో పెద్ద హడావుడే జరిగింది. ఆయన గెలుపుకోసం సోషల్ మీడియాలో పెద్ద వార్ సాగింది. కౌశల్ ఆర్మీ పేరిట ఫ్యాన్స్ ఆయనకు ఓటింగ్ సపోర్టు చేశారు. ఆ సమయంలో హోస్ట్ గా వ్యవహరించిన స్టార్ హీరో నానిపై ఒక దశలో కౌశల్ ఆర్మీ ఫైర్ అయింది. కౌశల్ ను కావాలనే డిస్క్రీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి ఫ్యాన్స్ సహకారంతో ఆయన ఓ స్టార్ హీరో కంటే ఎక్కువ ఇమేజ్ సొంతం చేసుకొని భారీ ఓటింగ్ తో టైటిల్ గెలిచాడు. అయితే ఈ టైటిల్ గెలిచిన తరువాత కౌశల్ మళ్లీ సినిమాల్లో, మీడియా ఎదుట కనిపించలేదు. కానీ ప్రతీ బిగ్ బాస్ సీజన్లో ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నాడు.

Also Read: Bigg Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ పేరు లీక్..? ఎవరంటే?

తాజాగా ఓ ఛానెల్లో కౌశల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఎవరో తనకు ముందే తెలుసన్నాడు. ప్రతీ సీజన్లో ఫైనల్ రెండు వారాలు ఉందనగానే తనకు విజేత ఎవరో తెలిసిపోతుందన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తాను ప్రకటించిన వారే టైటిల్ గెలిచారని చెప్పాడు. తన టార్గెట్ ఎప్పుడూ మిస్సవ్వదని కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు కూడా తాను చెప్పిందే జరుగుతుందనని అన్నాడు. ఈసారి టైటిల్ కచ్చితంగా బిందుమాధవి సొంతం చేసుకుంటుందని అంటున్నాడు. ఈసారి లేడీ విన్నర్ గా బిందుమాధవి రికార్డు సృష్టించనుందని అన్నారు.

Bigg Boss Telugu OTT- Kaushal Manda
Kaushal Manda

మరోవైపు ఇప్పటికే బిందుమాధవి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. విజేతను ఇప్పటికే ప్రకటించారని కొందరు పోస్టులు పెడుతున్నారు. అఖిల్ సార్థక్ రెండో స్థానానికే పరిమితం అయ్యారని అంటున్నారు. నాలుగో సీజన్లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు మరోసారి టైటిల్ చేజారిందని అంటున్నారు. కానీ బిగ్ బాస్ మాత్ర వ్యూహర్స్ ను తీవ్ర ఉత్కంఠలోకి నెట్టేసింది. ఓటింగ్ శాతం ఎప్పుడైనా మారొచ్చని చెబుతూ ఆసక్తి రేపుతోంది.

Also Read:Rashmika Mandanna Sister: రష్మిక చెల్లెలు ఫొటోలు వైరల్.. ఎలా ఉందో తెలుసా?
Recommended Videos
బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందుమాధవి || Bigg Boss Non Stop Title Winner Bindu Madhavi
NTR 30 Movie Sensational Update || Jr NTR New Movie || Siva Koratala || Kalyan Ram
జీవిత , రాజశేఖర్ ల పై  సంచలన ఆరోపణలు చేసిన  ప్రొడ్యూసర్ భార్య  | Hema Fires Jeevitha and Rajasekhar

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version