Katrina kaif: ‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారంటూ రూమర్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరు కూడా వారి రిలేషన్‌షిప్‌పై స్పందించలేదు. బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చిత్ర పరిశ్రమలో గుప్పుమన్న విషయం తెల్సిందే. అమ్మడు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక చిట్ చాట్ లో పాల్గొన్న కత్రినాకు విక్కీతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి కత్రినా ఊహించని సమాధానం చెప్పి అందరిని షాక్ కి గురిచేసింది.

“నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల నుంచి నా పెళ్లి గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఒక్కో వ్యక్తితో ఒక్కో నెల.. నెలకు ఎన్ని పెళ్లిళ్లు చేస్తారు” అని మండిపడింది. అంతేకాకుండా విక్కీతో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తామిద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ ఏమి లేవని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. పెళ్లి సంగతి పక్కన పెడితే కనీసం వీరిద్దరి మధ్య ప్రేమైనా ఉందా..? లేక అది కూడా టైం పాస్ యేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఏదైనా ఒక విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలంటే కుదిరే పనిలా లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే లీకైపోతుంది. ప్రస్తుతం కత్రినా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.