katrina kaif: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓమిక్రాన్గా తన రూపాన్ని మార్చుకుని.. ఈ మహమ్మారి ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. దీన్ని బట్టి చూస్తే.. మళ్లీ మునపటిలా ఆంక్షలు, నిబంధనలు విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రభావం పెళ్లిల్లు, శుభకార్యాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.

కాగా, బాలీవుడ్ ప్రేమ జంట క్రితనా కైఫ్- విక్కీ కైశల్ వివాహం గురించి అందరికీ తెలిసిందే. వచ్చే నెలలో వీరిద్దరు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్లో డిసెంబరులో వివాహ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావంతో వీరి వివాహ ప్రక్రియలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఓమిక్రాన్ కారణంగా తక్కువ అతిథుల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెడ్డంగ్ ప్లానర్స్తో చర్చలు జరిపుతున్నట్లు సమాచారం. రాజస్థాన్లో విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబరు 9న కత్రినా- విక్కీలు పెళ్లి పీటలెక్కనున్నారని కత్రినా బంధువులతో పాటు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరుగుతుందని వారు తెలిపారు.
పెళ్లికి, సినీ ప్రముఖులతో పాటు, రాజకీయనాయకులనూ పిలవాలని అనుకోగా. ప్రస్తుతం పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో ఆహ్వానితుల జాబితాను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త వేరియంట్ ప్రభావంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉండటం వల్ల ఆ జాబితాలో కూడా మార్పులు రావచ్చని అంటున్నారు.