Kashmir Files Movie Special Story: ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక చిన్న చిత్రానికి ఉంటుందని అంగీకరించగలమా ? కానీ, ఇప్పుడు దేశమంతా సినిమా ప్రియులు మాట్లాడుకుంటున్న ఏకైక చిత్రం ‘ది కశ్మర్ ఫైల్స్’. ఇది 1990 నాటి జమ్మూకశ్మీర్ పండిట్ల ఉచకోతల పై, వలసల నేపథ్యంలో వచ్చిన అతి వాస్తవిక చిత్రం. నిజంగానే ఈ చిత్రం అంత గొప్పగా ఉందా ?, ఐదుకి ఐదు రేటింగ్‌లు, రోజురోజుకు నాలుగింతుల పెరుగుతున్న కలెక్షన్స్.. అడక్కుండానే రాష్ట్రాలు వినోదపన్ను రాయితీలు ఇవ్వడం… ఇవి చాలు ఈ సినిమా స్థాయి చెప్పడానికి.
అయితే, ఇంత గొప్ప చిత్రానికి మరో కోణం.. ఈ చిత్రాన్ని ఆపాలంటూ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు, రెండు వర్గాల మధ్య కల్లోలం సృష్టించే చిత్రమంటూ ఈ చిత్రం పై విమర్శల వర్షం కురిపించారు. అయినా ఈ చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు ఆగడం లేదు. జనాల నోళ్లలో ప్రస్తుతం ఈ చిత్రం నానుతూనే ఉంది. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం చెయ్యొచ్చు, ఇది హిందూ మారణహోమంలోని కన్నీటి జ్ఞాపకం.
Also Read: అరగంటలోనే కోమటిరెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్.. ఏం జరుగుతోంది..?
ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. ప్రేక్షకుల్ని ఊహాలోకంలో ముంచెత్తే విజువల్ డ్రామా కాదు ఇది, పాటలు, ఫైట్లు, మసాలా ఐటమ్ సాంగ్స్ దట్టించి వండివార్చిన దిగజారుడు కమర్షియల్ సినిమా కాదు ఇది. ఎప్పుడో మర్చిపోయిన తమ మూలాల్ని గుర్తు తెచ్చుకొని థియేటర్లలోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న వాస్తవ కన్నీటి గాధల గమనం ఇది. తీవ్రమైన
తిరుగుబాటు.. అల్లరిమూకలు చెలరేగిపోయిన సమయంలో కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన అభాగ్యుల జీవితాల నిధి ఇది.
ఒకపక్క తుపాకులతో స్వైర విహారం చేస్తూ.. హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం జరుపుతుంటే.. ఆ దారుణాలను తట్టుకోలేక కట్టుబట్టలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద గుర్తులను తట్టిలేపిన చిత్రమిది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హృదయాలను కలచివేసిన సినిమా ఇది. మనసు పొరల్లో అణగారిపోయిన బాధను, ఆక్రోశాన్ని రెట్టింపు చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చూశాకా, చలించిపోని మనిషి లేడు. ముఖ్యంగా హృదయాలని పిండేసే కథనంతో ఈ చిత్రాన్ని నడిపాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.
నెలలు, సంవత్సరాలపాటు భయానక విద్వేష వాతావరణాన్ని సృష్టించి, చివరికి ఉగ్రవాద జిహాదీలంతా యధేచ్ఛగా హిందువుల పై నరసంహారం, బలాత్కారాలు జరపడం వంటివి మనం జీర్ణించుకోలేని అంశాలు. ఇంత పచ్చిగా చూపిస్తూ.. ప్రతి సన్నివేశంలో రక్త మాంసాలను చొప్పిస్తూ సినిమా తీసి మెప్పించడం సామాన్యమైన విషయం కాదు.
అయితే, ఈ రోజు ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా రాగానే, కాశ్మీరీ పండిట్ల కోసం కన్నీరు కారుస్తూ, జబ్బలు చరుచుకుంటూ బట్టలు చించుకుంటున్న మన నాయకులు, అధికారులంతా.. అసలు కాశ్మీర్ లో హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు ఏం చేశారు ?
నిజమే.. మనం బాబరీ మసీదు విధ్వంసానికి చూపించిన తాపత్రయంలో అర శాతం కూడా కాశ్మీరు పండితుల మీద చూపించలేకపోయాం. నిజమే.. మనం శ్రీరాముడి గుడి గురించి పోరాటం చేసిన దానిలో.. సగం కూడా కాశ్మీరు పండితుల రక్షణ కోసం పోరాటం చేయలేకపోయాం.
కనీసం కాశ్మీరు హిందువులకు పునరావాసం కల్పించే విధానాలను రూపొందించే విషయంలో కూడా మన ప్రభుత్వాలు పూర్తిగా ఓడిపోయ్యాయి. ఏమి చేయలేని మనం ఈ సినిమా చూసి కనీసం మనస్ఫూర్తిగా కన్నీళ్లు అయినా కారుద్దాం.
Also Read: ఏపీలో ‘విన్నింగ్’ కాంబినేషన్.. పాత ఫార్మూలానే గానీ.. ఏపీలో సక్సస్ ఫార్మూలా..!