https://oktelugu.com/

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కి న్యూజిలాండ్ లో ఆటంకాలు

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కు ఇంటా బయటా మంచి ఆదరణ లభిస్తోంది. కానీ, న్యూజిలాండ్ లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడగా.. ఆ దేశ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ మద్దతుగా నిలిచారు. ఎన్నో దేశాల్లో విడుదలైన ఈ సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది న్యూజిలాండ్ ప్రజల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై న్యూజిలాండ్ సెన్సార్ బోర్డ్ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 10:29 am
    Follow us on

    The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కు ఇంటా బయటా మంచి ఆదరణ లభిస్తోంది. కానీ, న్యూజిలాండ్ లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడగా.. ఆ దేశ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ మద్దతుగా నిలిచారు. ఎన్నో దేశాల్లో విడుదలైన ఈ సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది న్యూజిలాండ్ ప్రజల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.

    The Kashmir Files

    The Kashmir Files

    ఈ సినిమాపై న్యూజిలాండ్ సెన్సార్ బోర్డ్ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక చిన్న చిత్రానికి ఉంటుందని అంగీకరించగలమా ? కానీ, ఇప్పుడు ఈ సినిమా విషయంలో అంగీకరించక తప్పదు. 1990 నాటి జమ్మూకశ్మీర్‌ పండిట్ల ఉచకోతల పై, వలసల నేపథ్యంలో వచ్చిన ఈ వాస్తవిక చిత్రం ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది.

    Also Read: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !

    నిజంగానే ఈ చిత్రం అంత గొప్పగా ఉందా ? అంటే.. ఉందనే చెప్పాలి. లేకపోతే.. ఐదుకి ఐదు రేటింగ్‌లు ఎందుకు ఇస్తారు ? రోజురోజుకు నాలుగింతుల కలెక్షన్స్ ఎందుకు పెరుగుతాయి ? పైగా అడక్కుండానే రాష్ట్రాలు వినోదపన్ను రాయితీలు ఎందుకు ఇస్తాయి ? ఏది ఏమైనా ప్రస్తుతానికి సినిమా ప్రియులు మాట్లాడుకుంటున్న ఏకైక చిత్రం ‘ది కశ్మర్‌ ఫైల్స్‌’.

    అసలు ఈ చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. జనాల నోళ్లలో ప్రస్తుతం ఈ చిత్రం నానుతూనే ఉంది. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం చెయ్యొచ్చు, ఇది హిందూ మారణహోమంలోని కన్నీటి జ్ఞాపకం. ఈ సినిమా గురించి ఇంకా క్లుప్తంగా చెప్పుకుంటే.. ఎప్పుడో మర్చిపోయిన తమ మూలాల్ని గుర్తు తెచ్చుకొని థియేటర్లలోనే వెక్కి వెక్కి ఏడుస్తున్న వాస్తవ కన్నీటి గాధ ఈ చిత్రం.

    The Kashmir Files

    The Kashmir Files

    తిరుగుబాటు.. అల్లరిమూకలు చెలరేగిపోయిన సమయంలో కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన అభాగ్యుల జీవితాల నిధి ఇది. ఒకపక్క తుపాకులతో స్వైర విహారం చేస్తూ.. హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం జరుపుతుంటే.. ఆ దారుణాలను తట్టుకోలేక కట్టుబట్టలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద గుర్తులను తట్టిలేపిన చిత్రమిది. అందుకే ఈ చిత్రాన్ని మిస్ కావొద్దు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.

    Also Read: ‘రాజమౌళి’ విజయాల వెనుక కారణం అదేనా ?

    Recommended Video:

    The Kashmir Files Movie Analysis by Ramanathapuram Venkataramana || Ok Telugu

    Tags