Homeఎంటర్టైన్మెంట్Karuppu 10 Days Collections: 'కరుప్పు' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. దెబ్బకి విజయ్...

Karuppu 10 Days Collections: ‘కరుప్పు’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. దెబ్బకి విజయ్ , రజినీకాంత్ రికార్డ్స్ అవుట్..

Karuppu 10 Days Collections: సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. అయితే గత 13 ఏళ్లుగా ఈయనకు సరైన సూపర్ హిట్ లేకపోవడం , ఓపెనింగ్ వసూళ్లు రాకపోవడం వల్ల, సూర్య పని ఇక అయిపోయింది , ఆయన సినిమాలను ఎవ్వరూ చూడరు అని ట్రేడ్ విశ్లేషకులు ఎన్నో వ్యాఖ్యలు చేసేవారు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ ని చూసి, సూర్య రేంజ్ ఇదా అని అందరూ షాక్ కి గురయ్యారు. విడుదలై 10 రోజులు అయ్యింది , ఈ పది రోజుల్లో ఈ చిత్రం తమిళనాడు లో సీఎం విజయ్ , సూపర్ స్టార్ రజినీకాంత్ సాధించిన రికార్డ్స్ ని కూడా అనేక ప్రాంతాల్లో బద్దలు కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 10 రోజుల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా రాబట్టిన వసూళ్లను ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో సూర్య కి ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ , క్రేజ్ ఉండేది. కానీ వరుస ఫ్లాప్స్ కారణంగా ఇక ఆయన కం బ్యాక్ ఇవ్వడం కష్టమని మన ఆడియన్సు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ ‘కరుప్పు’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘వీరభద్రుడు’ అనే పేరుతో విడుదల చేసింది. కేవలం 7 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజుల్లో 13 కోట్ల రూపాయిలు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 26 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా అప్పుడే 5 కోట్ల రూపాయిలకు పైగా లాభాలు వచ్చాయి. ఇది సాధారమైన విషయం కాదు. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ వసూళ్ల లెక్కలు కూడా ఒకసారి చూద్దాం.

తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 10 రోజుల్లో 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూర్య కి సొంత రాష్ట్రం నుండి ఇదే మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమా అనుకోవచ్చు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 11 కోట్ల రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు , ఓవర్సీస్ నుండి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు 71 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ జరగ్గా, 238 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 114 కోట్ల రూపాయిల షార్ట్ వసూళ్లు వచ్చాయి. అంటే బయ్యర్స్ కి ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version