Karun Nair: పనికిరాడు అన్నారు. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడలేడన్నారు. నిలబడి పరుగులు చేయలేకపోతున్నాడని అంచనాకొచ్చారు. అందుకే జట్టులో చోటు ఇచ్చి.. కొన్ని అవకాశాలు ఇచ్చి.. ఆ తర్వాత పక్కన పడేశారు. దీంతో అతడు తన పునరాగమనాన్ని గట్టిగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. బలమైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు.
ఐపీఎల్ లో కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఢిల్లీ జట్టు తరఫున అద్భుతాలు చేశాడు. అతడు ఆడిన ఆట ఆమోగంగా ఉండడంతో భారత జట్టు మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించింది. టెస్ట్ జట్టులోకి తీసుకుంది. కానీ అతడు వచ్చిన అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.. అలాగని నిర్లక్ష్యంగా అవుట్ కాలేదు. కాకపోతే మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు.. మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది. ఫలితంగా జట్టు లో చోటు కోల్పోవడంతో.. అతడు మళ్లీ తన పునరాగమనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది.. ఇందులో భాగంగానే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో కర్ణాటక తరఫునుంచి కరుణ్ ఆడుతున్నాడు. కేరళ బౌలర్ల ధాటికి కర్ణాటక 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆపద్బాంధవుడిగా వచ్చిన కరుణ్ అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఆ ఒక్క సెంచరీ తోనే అతడు ఆగిపోలేదు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సంచలనం సృష్టించాడు. తద్వారా తనకు మరోసారి అవకాశం ఇస్తే ప్రకంపనలు సృష్టిస్తానని హెచ్చరికలు పంపాడు.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో టి20 సిరీస్ ఆడుతోంది. మరో రెండు మ్యాచ్లు ముగిస్తే ఈ సిరీస్ సమాప్తం అవుతుంది. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ కోసం ఇంతవరకు జట్టును ప్రకటించలేదు. అయితే తన అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా కరుణ్ అజిత్ అగర్కర్ కు పరీక్ష పెడుతున్నాడు.. స్వదేశంలో టోర్నీ జరుగుతోంది కాబట్టి.. ఒకవేళ అజిత్ అగర్కర్ కనుక కరుణ చూపిస్తే కరుణ్ కు జట్టులో చోటు లభిస్తుంది.