Telangana govt notice to Allu Aravind: అల్లు అరవింద్(Allu aravind) తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవలే చనిపోవడంతో అల్లు ఫ్యామిలీ మొత్తం శోకసంద్రం లో మునిగిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్ననే ఆమె పెద్ద కర్మ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు మరియు మెగా కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమం జరిగిన కోద్ది గంటలకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అల్లు అరవింద్ కి అక్రమ కట్టడం కేసు క్రింద షోకాజ్ నోటీసులు పంపించారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 లో అల్లు బిజినెస్ పార్క్ అనే కట్టడం జరిగింది. GHMC కేవలం మూడు అంతస్తుల కట్టడానికి మాత్రమే అనుమతి ని ఇవ్వగా, మూడు అంతస్తుల పైన ఒక పెంట్ హౌస్ ని నిర్మించారు. దీనిని వ్యతిరేకిస్తూనే GHMC షోకాజ్ నోటీసులు పంపింది.
ఈ నోటీసుల పై అల్లు అరవింద్ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్రమంగా కట్టిన ఆ పెంట్ హౌస్ కూల్చడానికి అల్లు అరవింద్ ఒప్పుకుంటాడా?, లేకపోతే GHMC కి వివరణ ఇచ్చి వాళ్ళ అనుమతి తీసుకుంటాడా?, లేదా హై కోర్టు మెట్లు ఎక్కుతాడా అనేది తెలియాల్సి ఉంది. అసలే కుటుంబం మొత్తం బాధలో ఉన్న ఈ సమయం లో ఇలాంటి నోటీసులు రావడం ఆ కుటుంబానికి ఎంత భారంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే దీనిపై అల్లు అరవింద్ వివరణ కోసమే మీడియా మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇండస్ట్రీ లో అగ్ర నిర్మాతగా అల్లు అరవింద్ ఎన్ని సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించాడో మనమంతా చూశాము. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆహా అనే ఓటీటీ యాప్ ని కూడా స్థాపించి ఓటీటీ రంగం లో కూడా అగ్రగామి గా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా ఈమధ్య కాలం లోనే ఆయన అల్లు స్టూడియోస్ ని కూడా ప్రారంభించాడు.
Also Read: పవన్ కళ్యాణ్ ని మా అమ్మ ‘కళ్యాణి’ అని పిలిచేది – అల్లు అరవింద్
ఇక కొడుకు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పాలా..?, దేశం గర్వించ దగ్గ నటులలో ఒకడిగా నిల్చి, పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చాటేందుకు త్వరలోనే సిద్ధం కాబోతున్నాడు. అలా కుటుంబం మొత్తం ఉన్నత స్థాయికి వెళ్తుండడం చూసి ఎన్ని లక్షల మంది దిష్టి తగిలిందో తెలియదు కానీ, వరుసగా ఆ కుటుంబం మొత్తం బాధ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.