https://oktelugu.com/

Karthika Deepam: కార్తీకదీపం సీజన్ 2.. ఈసారి ప్రత్యేకత ఏంటి? కథ ఎలా ఉండనుంది

కార్తీక దీపం సీజన్ 2 ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది. ఈ సీజన్ అంచనాలకు మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. స్టార్ మా ఛానల్ లోని బెస్ట్ సీరియల్స్ లో ఈ సీరియల్ ఒకటిగా నిలిచింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 20, 2024 / 10:40 AM IST
    Follow us on

    Karthika Deepam: సీరియల్స్ వస్తున్నాయంటే ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా మరీ టీవీలకు పరిమితం అవుతంటారు కొందరు. ఇక ఆ సీరియల్స్ కూడా అదే రేంజ్ లో ఆసక్తిని కలిగిస్తూ.. టీవీల ముందు కదలకుండా చేస్తాయి. ఇలాంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. దీనికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ కు అప్పట్లో రికార్డు స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి. ఇక ఈ సీరియల్ ను విచిత్రమైన మలుపులు తిప్పి ముగించడం విషయంలో గతంలో అసంతృప్తి వ్యక్త పరిచారు.

    ఈ సీరియల్ కు సీక్వెల్ రావాలని చాలామంది కోరుకున్నారు. అదే తరహాలో అడుగులు వేస్తున్నారట మేనేజ్మెంట్. అదే తరహాలో కార్తీకదీపం సీరియల్ మళ్లీ వచ్చేస్తోందంటూ స్టార్ మా కీలక ప్రకటన చేసింది. ఇక ఈ సీరియల్ కు సీక్వెల్ వస్తే మాత్రం అంచనాలకు మించి హిట్ అవడం పక్కా అంటున్నారు కొందరు. ఇందులో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ కనిపిస్తారా? లేక ఇతర నటీనటులు కనిపిస్తారా? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇక ఈ సీరియల్ బడ్జెట్ సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయట.

    కార్తీక దీపం సీజన్ 2 ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది. ఈ సీజన్ అంచనాలకు మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. స్టార్ మా ఛానల్ లోని బెస్ట్ సీరియల్స్ లో ఈ సీరియల్ ఒకటిగా నిలిచింది. ఇతర ఛానెళ్లు కూడా ఈ తరహా సీరియల్ ను ప్లాన్ చేసినా అవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కార్తీకదీపం సీరియల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనే సంగతి తెలిసిందే. అయితే అప్పటికి ఇప్పటికే ప్రేక్షకుల అభిరుచి మాత్రం మారింది.

    ప్రస్తుతం బుల్లితెరపై కంటే ఓటీటీలలో టీవీ సీరియళ్లను చూడడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఈ ఓటీటీలలో కార్తీకదీపం రేంజ్ సీరియల్స్ రావాలని భావిస్తున్నారు ఫ్యాన్స్. మరి స్టార్ మాకు ఊహించని స్థాయిలో రేటింగ్స్ వస్తున్న తరహాలో మేనేజ్మెంట్ ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.