https://oktelugu.com/

Amulya Omkar: ‘కార్తీకదీపం’ సౌర్యగా వచ్చిన ఈ అందాల ‘అమూల్య’ ఎవరో తెలుసా?

Amulya Omkar: తెలుగు సీరియళ్లలో కార్తీక దీపం కు ఉన్న ఆదరణ ఏంటో అందరికి తెలుసు. ప్రస్తుతం సీరియల్ కొత్త పుంతలు తొక్కుతోంది. పాత్రధారులు కొత్త వారిని తీసుకుని సీరియల్ ను మరో కోణంలో నడిపిస్తున్నారు. ఇందులో సౌర్యగా కనిపిస్తున్న నటిపైనే అందరి దృష్టి పడుతోంది. ఈమె ఎవరనే అనుమానం అందరిలో వస్తోంది. దీనికి అందరు నోళ్లలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ లో ఆటో డ్రైవర్ గా తనదైన శైలిలో నటిస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 06:31 PM IST
    Follow us on

    Amulya Omkar: తెలుగు సీరియళ్లలో కార్తీక దీపం కు ఉన్న ఆదరణ ఏంటో అందరికి తెలుసు. ప్రస్తుతం సీరియల్ కొత్త పుంతలు తొక్కుతోంది. పాత్రధారులు కొత్త వారిని తీసుకుని సీరియల్ ను మరో కోణంలో నడిపిస్తున్నారు. ఇందులో సౌర్యగా కనిపిస్తున్న నటిపైనే అందరి దృష్టి పడుతోంది. ఈమె ఎవరనే అనుమానం అందరిలో వస్తోంది. దీనికి అందరు నోళ్లలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ లో ఆటో డ్రైవర్ గా తనదైన శైలిలో నటిస్తున్న నటి ఎవరనే దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.

    Amulya Omkar

    ఆమె కన్నడ నటి. పేరు అమూల్య గౌడ. కర్ణాటకలోని మైసూర్ లో 1993 జనవరి 8న జన్మించిన ఈ అమ్మడు సీరియళ్లంటే ఉన్న మక్కువతోనే నటిగా ఎదిగింది. కన్నడలో కమలి అనే సీరియల్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. అంతకుముందు యారిగుంటు యారిగిల్ల అనే టీ షోలో కనిపించినా తరువాత 2014లో స్వాతి ముత్తు అనే సీరియల్ తో అరంగేట్రం అయిపోయింది. తదుపరి పునర్ వివాహ, ఆరామనే లాంటి సీరియళ్లలో నటించింది.

    Also Read:  టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం.. ఒకరిని చంపి.. ముగ్గురిని గాయపరిచినా చర్యల్లేవా?

    ప్రతి నాయిక పాత్రలో నటించి అందరిని మెప్పించడం ఆమెకు కొత్త కాదు. కమలిలో కూడా లీడ్ రోల్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమె దృష్టి తెలుగు సీరియళ్లపై పడటంతో కార్తీక దీపంలో అవకాశం అందిపుచ్చుకుంది. ఈ పాత్రతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకుంది. కార్తీక దీపం సీరియల్ ను కొత్త పంథాలో తెరకెక్కిస్తూ దర్శకుడు మరో అద్భుతం సృష్టిస్తున్నారు.

    Amulya Omkar

    తెలుగు ప్రేక్షకులు భాష ఏదయినా భావం ముఖ్యం అంటారు. నటనకే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే మన దగ్గర ఇతర భాషల చిత్రాలు కూడా ఘన విజయం సాధించడం తెలిసిందే. దీంతో కన్నడ బ్యూటీ అయిన అమూల్య తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుని తెలుగువారి మన్ననలు పొందడం ఖాయం. దీంతో తెలుగు సీరియళ్లలో కార్తీక దీపం సృష్టిస్తున్న వైవిధ్యం అంతా ఇంత కాదు. ఈ క్రమంలో అమూల్య జీవితంలో మరింత స్థాయికి ఎదగాలని ప్రేక్షకులు అభిలషిస్తున్నారు.

    Also Read:  పునీత్, సుశాంత్.. చనిపోయాక హిట్స్ కొట్టిన హీరోలు వీళ్లే

    Tags