https://oktelugu.com/

Shobha Shetty: కార్తీకదీపం మోనిత కన్నీటి కష్టాలు తెలిస్తే గుండె తరుక్కుపోతుంది!

Shobha Shetty: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో మోనిత(శోభ శెట్టి) గురించి అందరికీ తెలిసిందే.ఈమెను చూస్తే చిన్నప్పటి నుంచి బాగా ఉన్నత కుటుంబంలో జన్మించిందనే భావన అందరిలో కలుగుతుంది. కానీ ఈమె చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకుందని జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ క్వీన్ కార్యక్రమం ద్వార తన కన్నీటి కష్టాలు తెలుపుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ క్వీన్ అనే కార్యక్రమానికి ప్రదీప్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2021 11:19 am
    Follow us on

    Shobha Shetty: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో మోనిత(శోభ శెట్టి) గురించి అందరికీ తెలిసిందే.ఈమెను చూస్తే చిన్నప్పటి నుంచి బాగా ఉన్నత కుటుంబంలో జన్మించిందనే భావన అందరిలో కలుగుతుంది. కానీ ఈమె చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకుందని జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ క్వీన్ కార్యక్రమం ద్వార తన కన్నీటి కష్టాలు తెలుపుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

    Shobha Shetty

    Shobha Shetty

    జీ టీవీలో ప్రసారమవుతున్న సూపర్ క్వీన్ అనే కార్యక్రమానికి ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొని వారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీకదీపం సీరియల్ మోనిత పాల్గొన్నారు. ఈమెకు సంబంధించిన ఒక ఫోటోని ప్రదీప్ చూపించడంతో మోనిత కాస్త ఎమోషనల్ అయి తన చిన్నప్పటి కష్టాల గురించి వెల్లడించారు.

    Also Read: ధైర్యం కోల్పోయిన డాక్టర్ బాబుకు పెద్ద దిక్కుగా నిలిచిన వంటలక్క..!

    ఆమె బూట్లు వేసుకుని వాటికి సేఫ్టీ పిన్ పెట్టుకున్న టువంటి ఫోటోని చూపించాడు. ఈ ఫోటోను చూసిన మోనిత చిన్నప్పుడు మేము ఎంతో కష్టాలను అనుభవించానని స్కూల్ కి వెళ్ళాలి అంటే దాదాపు 20 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అయితే అప్పుడు డబ్బులు లేక ఇలా బూట్లు తెగిపోతే వాటిని కుట్టించుకోవాలి అంటే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ అయిదు రూపాయలు కూడా ఇచ్చి బూట్లు కుట్టించుకొలేని పరిస్థితి నాది.అందుకోసమే అలా పిన్స్ పెట్టుకొని స్కూల్ కి వెళ్లే దానిని అంటూ తన చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

    Also Read: కార్తీకదీపం లో మరో ట్విస్ట్.. కుటుంబంతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు!