https://oktelugu.com/

Karthika Deepam: కార్తీక్ కుటుంబం లో మనశ్శాంతి లేకుండా చేస్తున్న మోనిత.. ఆఖరికి ఆస్తులు కూడా!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ తన తల్లి సౌందర్యను తీసుకొని నీలమ్మ ఇంటికి వెళ్తాడు. నీలమ్మ కార్తీక్ వాళ్లను చూసి ఏడుస్తూ బాగా తిడుతుంది. కార్తీక్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. తన ఆస్తులను మొత్తం తమ కుటుంబానికి ఇచ్చేస్తాడు. ఇక కారులో ఇంటికి వెళ్తూ పాత విషయాలను గుర్తుచేసుకొని బాధపడుతుంటారు. వాళ్లకోసం ఆనందరావు బయట ఎదురు చూస్తాడు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2021 / 09:14 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ తన తల్లి సౌందర్యను తీసుకొని నీలమ్మ ఇంటికి వెళ్తాడు. నీలమ్మ కార్తీక్ వాళ్లను చూసి ఏడుస్తూ బాగా తిడుతుంది. కార్తీక్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. తన ఆస్తులను మొత్తం తమ కుటుంబానికి ఇచ్చేస్తాడు. ఇక కారులో ఇంటికి వెళ్తూ పాత విషయాలను గుర్తుచేసుకొని బాధపడుతుంటారు. వాళ్లకోసం ఆనందరావు బయట ఎదురు చూస్తాడు.

    Karthika Deepam

    ఇక సౌందర్య, కార్తీక్ ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంటారు. మరోవైపు దీప బస్తీలో స్థలం కోసం వారణాసి వాళ్ళతో మాట్లాడుతుంది. వారణాసి కూడా ఈ స్థలాన్ని కొనుగోలు చేయమని చెబుతాడు. ఇక దీప ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనేస్తాను అని మాట ఇస్తుంది. బస్తీ లో ఉండటం చాలా ఇష్టమని ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది.

    Also Read: కత్రినా కారు ఆపిన ట్రాఫిక్​ పోలీస్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

    మరోవైపు మోనిత ప్రియమణి భోజనం చేస్తుండగా వచ్చి కార్తీక్ పై తనకున్న ప్రేమ గురించి చెబుతుంది. కార్తీక్ అంటే ఎంతో ఇష్టమని.. చేసిన కూరలు నచ్చకపోతే మరోచోట వెళ్లి తింటాము. కానీ ప్రేమించిన వ్యక్తులను మాత్రమే వదులుకోము అంటూ కార్తీక్ ప్రేమ గురించి చెబుతుంది. ప్రియమణి మాత్రం తన మనసులో.. భోజనం చేయకుండా చేస్తుందని అనుకునేసరికి వెంటనే మోనిత ప్రియమణి మనసులో అనుకున్న మాటలను బయట పెడుతుంది.

    ఇక కార్తీక్, సౌందర్య ఆలోచిస్తూ ఉండగా దీప తెగ సంతోషంగా ఇంట్లోకి వస్తుంది. రావడంతోనే కార్తీక్ దగ్గరికి వెళ్లి బస్తీలో ఉన్న స్థలం గురించి చెబుతుంది. కానీ వాళ్లు మాత్రం తాము కోల్పోయిన ఆస్తుల గురించి ఆలోచిస్తూ ఈ విషయాన్ని దీపకు ఎలా చెప్పాలని అనుకుంటారు. ఇక కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి తనను కౌగిలించుకుని బాగా ఎమోషనల్ అవుతాడు. ఏమైంది డాక్టర్ బాబు అని దీప టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తుంది. మొత్తానికి కార్తీక్ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది మోనిత.

    Also Read: చచ్చిపోతానేమో అనుకున్నా.. చైతన్య విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు