బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సీరియల్లో ఎన్నో ట్విస్టులతో ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా.. దీపావళి పండుగ కావడంతో మోనిత ఎంతో అందంగా ముస్తాబై దీపాలను పెడుతూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో కార్తీక్ నా పక్కన ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్ తో కలిసి నేను దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటామో అని ఆలోచిస్తుండగానే ఎలాగైనా కార్తీక్ దగ్గరికి వెళ్లి నేనో ఆ దీపనో తేలుస్తా అని భావిస్తుంది.
ఇక ప్రియమణికి ఆనందరావుని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ తన కార్తీక్ దగ్గరికి వెళ్తున్నానని చెప్తుంది. ప్రియమణి చూపులను బట్టి మోనిత తనతో చాల సీరియస్ గా మాట్లాడుతుంది. తను ఒక గొప్ప ప్రేమికురాలిని కార్తీక్ ను తన మాత్రమే బాగా అర్థం చేసుకుంటానని,ఆ దీప దూరం అయినప్పుడు నిత్యం తన దగ్గరకు వచ్చి తన భుజంపై వాలి తన కష్టాలన్నీ నాకు చెప్పుకునే వాడని మోనిత కార్తీక్ గురించి చెబుతుంది.
ఇకఅప్పుడు కార్తీక్ తనతో ఎంతో బాగా మాట్లాడేవాడు తనని ఎంతో పొగిడే వాడు కానీ ఇప్పుడు ఆ సౌందర్య ప్రేమకు లొంగీ పోతున్నాడు. నిత్యం ఆ దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. అందుకే తను కావాలో నేను కావాలో తేల్చుకుంటానని బయలుదేరుతుంది. ఇక కార్తీక్ దీప ప్రవర్తన గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. తనకు నిజం తెలిసిన ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది. దీప ఏదైనా ఆలోచనలో ఉందా అంటూ తన గురించి ఆలోచిస్తాడు. ఇక ఈ సమయంలోనే మోనిత కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసిన కార్తీక్ తో అవతల నుంచి మోనిత కాస్త ఓవరాక్షన్ గా మాట్లాడుతుంది. శ్రీవారు ,నాదా అంటూ మాట్లాడటంతో కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
ఈ క్రమంలోనే కార్తీక్ తనపై కోపం తెచ్చుకుని నోర్ముయ్ అలా పిలవద్దు నువ్వు అలా పిలుస్తుంటే నాకు మండిపోతుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటలు విన్న తర్వాత మోనిత నేను మీ ఇంటి చివరి దగ్గర వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చేయ్ అని చెప్పడంతో అందుకు కార్తిక్ రానని సమాధానం చెబుతాడు. అయితే నేనే వస్తున్నా అని చెప్పడంతో షాకైన కార్తీక్ తన దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఆ సమయంలోనే వంటలక్క నవ్వుతూ కార్తీక్ తో మాట్లాడాలని చెబుతుంది. కానీ మోనిత ఫోన్ చేయడంతో అర్జెంట్ పని ఉందని అక్కడినుంచి వెళ్తాడు. ఇలా ఇద్దరూ ఒకచోట కలుసుకున్న తర్వాత కార్తీక్ మోనిత మాటలకు గట్టిగా అరుస్తూ తన పై కోపం తెచ్చుకుంటాడు. దీంతో మోనిత తన స్టాఫ్ ని పిలిపించి వారితో సెల్ఫీ లకు ఫోజులిచ్చేలా చేయడంతో మోనిత మరొక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అయితే మోనిత ఎలాంటి పథకం వేసిందో తెలియాలంటే తరువాత ఎపిసోడ్ చూడాల్సి ఉంది.