Doctor Babu-Monitha: ‘కార్తీకదీపం’ సీరియల్ ఇప్పుడు తెలుగులోనే నంబర్ 1 గా వెలుగొందుతోంది. రేటింగ్ లో దూసుకుపోతోంది. వంటలక్క తన భర్తను చేరువ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేయడం..దాన్ని అడ్డుకునే విలన్ గా మోనిత వేసే ఎత్తులు పై ఎత్తులు.. మధ్యలో డాక్టర్ బాబు నలిగిపోవడం..ఇలా ఇద్దరు పడతుల మధ్య పడి చిత్తు అయిపోయిన ఈ సీరియల్ తెలుగు నాట బాగా ప్రేక్షకాదరణ పొందింది.

డాక్టర్ బాబు ప్రేమ కోసం మోనిత పడే తపన అంతా సీరియల్ లో హైలెట్ అని చెప్పొచ్చు. కానీ డాక్టర్ బాబు మాత్రం తన భార్య వంటలక్క దీప కోసం వెళతాడు. ఈ సీరియల్ లో విలన్ మోనిత.. హీరో డాక్టర్ బాబుకు అస్సలు పడదు. అయితే అది ఆన్ స్క్రీన్ పైనే.. ఆఫ్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని తెలిసింది.
Also Read: Ram Charan: రాంచరణ్ గొప్ప మనసు.. ఉక్రెయిన్ లో తన బాడీ గార్డ్ కు సాయం..
తాజాగా మాటీవీలో ‘హోలీ పండుగ’ సందర్భంగా ఒక స్పెషల్ షోను నిర్వహించారు. ఇందులో విలన్ మోనిత, హీరో డాక్టర్ బాబులు రోమాన్స్ తో అందరినీ ఫిదా చేశారు. ఈ షోలో పాల్గొన్న జంటల మధ్య రోమాన్స్ ను యాంకర్ రష్మి కోరగా.. అక్కడున్న జంటల్లో మోనిత-డాక్టర్ బాబు కలిసి ఒక ఫీట్ చేశారు. మోనితను ఎత్తుకొని అలాగే రోమాంటిక్ గా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ వారిద్దరూ కనిపించారు.

ఈ క్రమంలోనే యాంకర్ రవి వాళ్ల వద్దకు వెళ్లి ‘ఏంటీ రోమాన్స్.. ఏమనిపిస్తోంది?’ అంటూ అడిగేశాడు. దానికి డాక్టర్ బాబు ‘ఎంతసేపు ఎత్తుకోవాలి? టైం లేదా?’ అన్నట్టుగా బదులిచ్చాడు. మోనిత బరువుగా ఉందన్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అందరూ ఏదో ఒక రోమాంటిక్ యాంగిల్ ఇస్తే డాక్టర్ బాబు మాత్రం మోనితను ఎత్తుకొని సందడి చేశాడు. దీనిపైనే యాంకర్ రవి సెటైర్లు వేశాడు. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: RRR Ticket Prices: ‘ఆర్ఆర్ఆర్’ మరీ ఇంత కాస్లీనా?
Recommended Video: