Karthika Deepam 2: విడుదలకు ముందే కార్తీక దీపం 2 రికార్డు… సీరియల్స్ హిస్టరీలో ఫస్ట్ టైం!

టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీరియల్ కి ప్రీవ్యూ ఈవెంట్ నిర్వహించడం పై అంతా షాక్ అవుతున్నారు. మార్చి 25 ప్రారంభం అవుతుండగా, సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు స్టార్ మా ఛానల్ లో కార్తీక దీపం 2 ప్రసారం కానుంది.

Written By: S Reddy, Updated On : March 25, 2024 6:56 pm

Karthika Deepam 2 create record before release

Follow us on

Karthika Deepam 2: బుల్లితెర సంచలనం కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్తీకదీపం నవవసంతం అంటూ విడుదలైన ప్రోమోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సీరియల్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ఇచ్చింది కార్తీకదీపం టీం. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. కార్తీకదీపం సీక్వెల్ అంటే ఆమాత్రం ఉంటుంది మరీ అని ప్రేక్షకులు వాపోతున్నారు.

టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీరియల్ కి ప్రీవ్యూ ఈవెంట్ నిర్వహించడం పై అంతా షాక్ అవుతున్నారు. మార్చి 25 ప్రారంభం అవుతుండగా, సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకు స్టార్ మా ఛానల్ లో కార్తీక దీపం 2 ప్రసారం కానుంది. ఇక సీరియల్ ప్రొమోషన్స్ లో భాగంగా మార్చి 21న కార్తీకదీపం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది స్టార్ మా. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ముఖ్య అతిధులుగా నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ హాజరై సందడి చేశారు. అంతేకాదు కార్తీకదీపం ఇది నవ వసంతం సీరియల్ ప్రీవ్యూ ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ని బుల్లితెర ప్రేక్షకులు వీక్షించారు. తాము ఎంతగానో అభిమానించే డాక్టర్ బాబు, వంటలక్క ను నేరుగా చూసి సంతోష పడుతున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సీరియల్ పై అంచనాలు భారీగా పెంచేసింది. కార్తీకదీపం పార్ట్ 1 దాదాపు ఆరేళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది.

దేశవ్యాప్తంగా అత్యధిక రేటింగ్ సాధించి నంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. కార్తీకదీపం 1569 ఎపిసోడ్ ల వరకు విజయవంతంగా కొనసాగించారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, సౌందర్య, హిమ, సౌర్య అనే కీలక పాత్రలు ఆడియన్స్ ని ఎంతగానో అలరించాయి. సాయంత్రం 7. 30 అయితే జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇక కార్తీకదీపం నవ వసంతం అంటూ వస్తున్న పార్ట్ 2 ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.