MISS WORLD 2024 : టాప్ – 8 లో మన సినీ శెట్టి

అంత క్రితం మిస్ వరల్డ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో ఇండియాకు చెందిన సినీ శెట్టి టాప్ -12 లోకి అర్హత సాధించింది. భారత్ తో పాటు బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బోట్స్ వానా, మారిషస్, ఉగాండా, చెక్ రిపబ్లిక్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇండియా, లెబనాన్ దేశాలకు చెందిన అందమైన యువతులు టాప్ -10 లో నిలిచారు. అయితే ఇందులో స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన యువతులు టాప్ -8 లోకి ప్రవేశించలేకపోయారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 9, 2024 10:47 pm
Follow us on

MISS WORLD 2024 : ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. మరి కొద్ది క్షణాల్లో 2022 ప్రపంచ సుందరి కరోలినా బిలావాస్కా తదుపరి విజేతకు కీరిటాభిషేకం చేస్తారు. ఈ ఘట్టం కోసం 115 దేశాలకు చెందిన అందమైన యువతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మిస్ వరల్డ్- 2022 కిరీటాన్ని పోలాండ్ దేశానికి చెందిన కరోలినా బిలావాస్కా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ వేడుక SONY LIV, MISS WORLD వెబ్ సైటు లో ప్రత్యక్ష ప్రసారమవుతున్నది.. మన దేశానికి చెందిన 22 సంవత్సరాల సినీ శెట్టి ఈ పోటీల్లో పాల్గొన్నారు.. ప్రస్తుతం ఆమె టాప్ -8 లో కొనసాగుతున్నారు.

టాప్ -8 పోటీదారులు వీరే

1. లెటిసియా ప్రోటా అమెరికా (బ్రెజిల్)
2. అచే అబ్రహమ్స్(ట్రిని డాడ్, టొబాగో)
3. లెసెగో చోంబో( బోట్స్ వానా)
4. హన్నా కరేమా(ఉగాండా)
5. యూరప్ (చెక్ రిపబ్లిక్)
6. జెస్సికా యాష్లే (ఇంగ్లాండ్)
7. సినీ శెట్టి (ఇండియా)
8. యాస్మిన్ అజై టౌన్ (లేబనాన్)

అంత క్రితం మిస్ వరల్డ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో ఇండియాకు చెందిన సినీ శెట్టి టాప్ -12 లోకి అర్హత సాధించింది. భారత్ తో పాటు బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బోట్స్ వానా, మారిషస్, ఉగాండా, చెక్ రిపబ్లిక్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇండియా, లెబనాన్ దేశాలకు చెందిన అందమైన యువతులు టాప్ -10 లో నిలిచారు. అయితే ఇందులో స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన యువతులు టాప్ -8 లోకి ప్రవేశించలేకపోయారు.

ఇక దీనికంటే ముందు జరిగిన పోటీల్లో మిస్ వరల్డ్ సంస్థ బ్యూటీ విత్ ఏ పర్పస్ అవార్డును ప్రకటించింది. బ్రెజిల్ దేశానికి చెందిన లెటీసియా ఫ్రోటా ఈ పురస్కారం దక్కించుకుంది. ఆమె అంతర్జాతీయంగా హాన్సెన్స్ అనే వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈమె దక్షిణాఫ్రికా, జింబాబ్వే, అమెజాన్ ప్రాంతాలలో స్వచ్ఛంద సేవలు కూడా నిర్వహించింది. అక్కడ పేద ప్రజలకు ఆహారం, నీటిని అందించింది. ఇలా వాటిని అందించేందుకు ఆమె పలు సంస్థల నుంచి నిధులు సేకరించింది. ఈమె చేస్తున్న సేవను గుర్తించి మిస్ వరల్డ్ సంస్థ బ్యూటీ విత్ ఏ పర్పస్ పురస్కారాన్ని అందజేసింది.