Kareena Kapoor: కరీనా కపూర్.. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరోయిన్. పైగా పెద్ద హీరోకి భార్య, అలాగే రాజవంశపు కోడలు కూడా. మరి అలాంటి కరీనాకు ఆర్థిక కష్టాలుంటాయని ఎవరు అనుకుంటారు ? అయితే ఎవరు అనుకున్నా అనుకోకపోయినా తనకు కొన్ని ఆర్ధిక కష్టాలు ఉన్నాయని అంటుంది ఈ టాల్ బ్యూటీ. అది నిజమే కరీనా తన జీవిత ప్రయాణంలో ఎన్నో చూసింది.

చాలా సాధారణ పరిస్థితులు చూసింది, విలాసాల భోగాలు చూసింది. అయితే, కపూర్ ఫ్యామిలీలో పుట్టిన కరీనాకు ఎందుకు సాదాసీదా స్థితి వచ్చింది అంటే.. కరీనా తండ్రి రణ్ ధీర్ కపూర్ దాదాపు ఇరవై ఏళ్ల పాటు కరీనా తల్లిని దూరం పెట్టాడు. దాంతో జీవితంలో ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్లిపోయింది కరీనా.
ఆ సమయంలోనే సగటు మధ్యతరగతి కుటుంబంలోని ఒక అమ్మాయిలా ఆర్టీసీ బస్సులో కాలేజ్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే వెళ్ళింది కూడా. ఆ రోజులు తన జీవితంలో ఎంతో కష్టంగా గడిచాయి అంటుంది కరీనా. ఒక పక్క పేరుకు సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది, కానీ పరుసులో పది రూపాయలు కూడా ఉండవు. మరోపక్క తోటి పిల్లలు అంతా ఆర్థిక విలాసాలతో సంతోషంగా ఉన్నారు.
‘మేము మాత్రం ఏమి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాం’ అంటూ కరీనా ఇప్పటికీ బాధ పడుతూ చెప్పింది. అయితే తన అక్కయ్య కరిష్మ హీరోయిన్ అయ్యాక, కరీనా జీవితం మారిపోయింది అట. దీనికితోడు కరిష్మాకు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ వచ్చింది. దాంతో తన పెద్దకూతురు హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక, రణ్ ధీర్ కూడా తన మనసు మార్చుకుని మళ్లీ కుటుంబంతో కలిసిపోయాడు.
Also Read: Bala Krishna: బాలకృష్ణ – గోపిచంద్ మలినేని మూవీ లో హీరోయిన్ ఫిక్స్… ఎవరంటే ?
ఆ తర్వాత కరీనా కూడా హీరోయిన్ అయింది. పైగా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. నెంబర్ వన్ గా కోట్ల రూపాయల పారితోషకాలు అందుకుంది. ఇక సైఫ్ ను పెళ్లి చేసుకున్నాక, ఆమె జీవితం మరో స్థాయికి చేరింది.
Also Read: Korean Remake: కొరియన్ సినిమా రీమేక్‌లో టాలీవుడ్ హాట్ భామలు.. టైటిల్ ఇదే!