Kantara Closing Collections: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాసిన పాన్ ఇండియన్ మూవీస్ లో ఒకటి ‘కాంతారా’..కన్నడ లో ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా KGF చాప్టర్ 2 కలెక్షన్స్ ని దాటేసి ఇండస్ట్రీ హిట్ అవుతుందని బహుశా కాంతారా మూవీ టీం కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు..కేవలం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 400 కోట్ల రూపాయిల వసూళ్లు సాధించింది అంటే ఇది ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్టో తెలుస్తుంది..కన్నడ లో విడుదలైన రెండు వారాల తర్వాత అక్కడ వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని చూసి తమిళం, తెలుగు , మలయాళం మరియు హిందీ బాషలలో విడుదల చేసారు..ఈ భాషల్లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి..తెలుగు లో అయితే ఇప్పటి వరుకు ఈ చిత్రానికి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఒకసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఇప్పటి వరుకు ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజం 13.00 కోట్లు
సీడెడ్ 3.20 కోట్లు
ఉత్తరాంధ్ర 3.70 కోట్లు
ఈస్ట్ 2.15 కోట్లు
వెస్ట్ 1.34 కోట్లు
నెల్లూరు 1.00 కోట్లు
గుంటూరు 1.75 కోట్లు
కృష్ణ 1.73 కోట్లు
మొత్తం 27.87 కోట్లు
ఓవర్సీస్ 3.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 31.57 కోట్లు
ఇప్పటి వరుకు విడుదలైన డబ్బింగ్ సినిమాలలో కాంతారా చిత్రం 65 కోట్ల రూపాయిల వసూళ్లను టాప్ 4 చిత్రం గా నిలిచింది..మొదటి స్థానం లో KGF చాప్టర్ 2 చిత్రం 185 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, రెండవ స్థానం 2 పాయింట్ 0 చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్..మూడవ స్థానం లో రోబో 72 కోట్ల రూపాయిలు ,నాల్గవ స్థానం లో కాంతారా 65 కోట్ల రూపాయిలు, ఐదవ స్థానం లో శంకర్ ఐ 57 కోట్ల రూపాయిలు..మొదటి నుండి టాలీవుడ్ లో తమిళ దబ్ సినిమాల హవానే ఎక్కువగా కనిపించేది.

కానీ చాలా కాలం తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ కి చెందిన రెండు సినిమాలు టాప్ 5 డబ్బింగ్ మూవీస్ లో ఒకటిగా నిలవడం విశేషం..KGF చిత్రం నుండి కన్నడ చలన చిత్ర పరిశ్రమ ముఖ చిత్రమే మారిపోయింది అని చెప్పొచ్చు.