Kantara Chapter1 Updates: ఎలాంటి అంచనాలు లేకుండా ఒక ప్రాంతీయ భాషలో మాత్రమే సినిమా విడుదలై, ఆ తర్వాత అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, పాన్ ఇండియా లెవెల్ కి విస్తరిస్తూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘కాంతారా'(Kantara Movie). 2022 వ సంవత్సరం లో కన్నడ లో విడుదలైన ఈ చిత్రం ఒక బాక్స్ ఆఫీస్ సునామీ ని సృష్టించింది. అక్కడ సూపర్ హిట్ అయినా తర్వాత తెలుగు, తమిళం, హిందీ లోకి దబ్ చేశారు. ఈ మూడు భాషల్లోనూ ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, అద్భుతమైన నటన కనబర్చినందుకు గానూ రిషబ్ శెట్టి(Rishab Shetty) కి ఉత్తమ నటుడు క్యాటగిరీ లో నేషనల్ అవార్డు కూడా దక్కింది.
Read Also: ఆకట్టుకుంటున్న శివ కార్తికేయన్ ‘మదరాశి’ ట్రైలర్..మురుగదాస్ విశ్వరూపం!
అలాంటి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ కి ప్రీక్వెల్ గా ‘కాంతారా: చాప్టర్ 1′(Kantara : Chapter 1) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. అందుకే మార్కెట్ లో కూడా క్రేజ్ విపరీతంగా ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా జరగలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 95 కోట్ల రూపాయలకు జరిగిందని తెలుస్తుంది.
Read Also: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ హక్కులను సొంతం చేసుకున్నాడట. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ‘కాంతారా: చాప్టర్ 1’ అంతకు మించిన బిజినెస్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం అత్యధిక థియేటర్స్ లో రన్ అవుతూ ఉండేది. అలాంటి సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రేంజ్ వసూళ్లు సాధించడం అనేది గొప్ప విషయమే. ‘కాంతారా’ తెలుగు వెర్షన్ హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేసాడు. ఇప్పుడు ‘కాంతారా : చాప్టర్ 1’ ని కూడా ఆయనే కొనుగోలు చేసాడనే టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.