Kantara Chapter 1 Trailer: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘కాంతారా : ది చాప్టర్ 1′(Kantara: The chapter 1) చిత్రం వచ్చే నెల 2వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ‘కాంతారా : ది లెజెండ్’ చిత్రం క్లైమాక్స్ లో హీరో మాయం అయిపోతాడు గుర్తుందా? , అక్కడి నుండే ఈ సినిమా మొదలు అవ్వబోతుందని ఈ ట్రైలర్ లో చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి(Rishab Shetty). అసలు ఎవరు ఈ కాంతారా?, అతను దేవుడు అవ్వడానికి కారణం ఏంటి?, అతన్ని నమ్మించి దెబ్బ తీసింది ఎవరు?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా. అంటే ప్రస్తుత కాలం లో జరిగే సినిమా మాత్రం కాదు అన్నమాట. ‘కాంతారా’ గతం గురించి తెలిపే సినిమా. ట్రైలర్ ని చూస్తుంటే సినిమాని చాలా రిచ్ గా, మంచి క్వాలిటీ తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
కానీ కాంతారా చిత్రం లో ఉన్న ‘వావ్’ ఫ్యాక్టర్ మాత్రం ఎందుకో ఇందులో మిస్ అయ్యినట్టు గా అనిపించింది. ఎక్కడా కూడా హై గా ఫీల్ అయ్యే మూమెంట్ లేదు. కాంతారా చిత్రం లో క్లైమాక్స్ ఆడియన్స్ కి పూనకాలు రప్పించేలా చేసింది. అలాంటి సీక్వెన్స్ ఈ సినిమాలో ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా వంద కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. కానీ ఈ ట్రైలర్ ని చూస్తుంటే వాళ్లకు చాలా గట్టి దెబ్బ పడేలాగానే అనిపిస్తుంది. పైగా ఈ సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఓజీ కి పోటీ గా రాబోతుంది. ఆ సినిమా ట్రైలర్ కంటెంట్ చూస్తే గట్టిగానే హిట్ అయ్యేలాగా, పవన్ కళ్యాణ్ కం బ్యాక్ లాగా అనిపిస్తుంది. మరి ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే కాంతారా ఆ మేనియా ని తట్టుకొని నిలబడగలదా లేదా అని విశ్లేషకులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు.
ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాకు సీక్వెల్ అంటే ఎదో కొంత స్పెషల్ ఉండాలి కదా, అదే కొరవడింది. స్టోరీ కూడా రొటీన్ లాగానే అనిపిస్తుంది. ఒక రాజు కి కాంతారా ఎదుగుదల ని చూసి అసూయ కలుగుతుంది. తన స్థానాన్ని ఎక్కడ ఆక్రమించివుంటాడో అనే భయం తోనే అతను ఆ కాంతారా ని వెన్నుపోటు పొడిచి ఉంటాడని ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటించింది. రిషబ్ శెట్టి కి ఆమె జోడి పర్ఫెక్ట్ గా సరిపోయింది. సినిమాలో కూడా ఈ పెయిర్ కి మంచి మార్కులే పడేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ ఎలా ఉన్నా, సినిమాలో కచ్చితంగా ఎదో ఒక విషయం ఉండే ఉంటుంది అని బలంగా నమ్ముతున్నారు ఆడియన్స్.