Kantara 2 shocking incidents: గత 3 సంవత్సరాల క్రితం కాంతార సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. పాన్ ఇండియాలో ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ అయితే దక్కింది. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసిన విషయం మనకు తెలిసిందే…యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. మరి ఇలాంటి క్రమంలోనే కాంతార సినిమా కి సీక్వెల్ గా ఇప్పుడు కాంతార చాప్టర్ 1 అనే పేరుతో ఒక సినిమా అయితే వస్తోంది. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో భారీ రికార్డు లను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కాంతార సినిమాకు సంబంధించిన కొంతమంది చనిపోతున్నారు అనే విషయాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి కాంతార చాప్టర్ 1 సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా వరకు ఇబ్బందులైతే ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని స్వయంగా కాంతార ట్రైలర్ ఈవెంట్లో రిషబ్ శెట్టి చెప్పడం విశేషం…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నా కూడా రిషబ్ శెట్టి చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే దక్కుతోంది. అయితే ‘కాంతార’ మూవీ సక్సెస్ అయిన తర్వాత కాంతార మూవీ కి సీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ సినిమాని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే రిషబ్ శెట్టి కాంతార 2 మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన కొంతమంది చనిపోయిన విషయం వాస్తవమే… అలాగే సినిమా కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఎలాగైనా సరే సినిమాని అనుకున్న రేంజ్ లో తీయాలని ఉద్దేశ్యంతో సినిమా కోసం చాలా వరకు కష్టపడ్డారు.
ఇక కొన్ని అనివార్య కారణాలు జరిగినప్పటికి అవన్నీ తట్టుకొని మేమంతా నిలబడ్డాం కాబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే ప్రతిసారి మాకు దేవుడి అనుగ్రహం కూడా కలుగుతూ వచ్చింది. మా వెంట దేవుడు ఉన్నాడు. కాబట్టి మేము వీలైనంత తొందరగా ఈ సినిమాను కంప్లీట్ చేయగలిగాము అంటూ చెప్పడం విశేషం…ఇక ఈ సినిజా అక్టోబర్ 2 వ తేదీన దసర కానుక్ష ప్రేక్షకుల ముందుకు వస్తోంది…