Kantara 2 Collection: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సీక్వెల్స్ చాలా అరుదుగా ఫ్లాప్ అవ్వడం వంటివి మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుత ట్రెండ్ లో సీక్వెల్స్ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ వేరు. సరిగా తెరకెక్కించాలే కానీ, ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తుంటారు. ఇప్పుడు ‘కాంతారా 2′(Kantara : The Chapter 1) చిత్రానికి కూడా అదే జరుగుతుంది. మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతారా: ది చాప్టర్ 1’ చిత్రానికి కేవలం 10 రోజుల్లోనే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందుకొని సంచలనం సృష్టించింది. సాధారణంగా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడడం లేదని ట్రేడ్ నుండి ఒక కంప్లైంట్ ఉంది.
జరిగిన రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ చిత్రం భారీ నష్టాలను చూసే దిశగానే అడుగులు వేస్తుంది. కానీ కర్ణాటక ప్రాంతం లో మాత్రం ఇండస్ట్రీ హిట్ ని అందుకునే దిశగా ముందుకు పోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 9 రోజుల్లో 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద టాస్క్. ఎంత షేర్ వసూళ్లను రాబట్టాలన్నా ఈ వీకెండ్ నే రాబట్టాలి. మరుసటి వారం లో దీపావళి కానుకగా వరుసగా 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. థియేటర్స్ అధిక శాతం వాటికే వెళ్లిపోతాయి కాబట్టి, అప్పటి లోపు ఈ చిత్రం ఎంత రికవరీ చేస్తుంది అనేది చూడాలి. టార్గెట్ అయితే చాలా పెద్దదే.
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, ఈ చిత్రం అక్కడి బయ్యర్స్ ని ప్రీమియర్ షోస్ నుండే తీవ్రమైన నిరాశకు గురి చేస్తూ వస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 9 మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మహా అయితే ఇంకో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మాత్రమే వస్తుందని, అంతకు మించి ఒక్క పైసా కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. కేవలం నార్త్ అమెరికా లోనే కాదు, మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాల్లో కూడా ఎందుకో ఈ చిత్రం అనుకున్న స్థాయి వసూళ్లను రాబట్టడం లో ఘోరంగా విఫలమైంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.