Kantara 2 Collection Day 2: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతారా 2′(Kantara : The Chapter 1) చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. కానీ కొంతమంది ప్రేక్షకులు పార్ట్ 1 లో చూసిన సన్నివేశాలే రెండవ భాగం లో చూసినట్టు ఉందని, అందులో ఉన్న మ్యాజిక్ ని డైరెక్టర్/ హీరో రిషబ్ శెట్టి మళ్లీ రీ క్రియేట్ చేయలేకపోయాడని అంటున్నారు. ఈ టాక్ ఎఫెక్ట్ కూడా సినిమా పై కొంత ప్రభావం చూపిస్తుంది. ఇండియా వైడ్ గా తెలుగు, కన్నడ వెర్షన్స్ లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. మలయాళం లో కూడా పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. కానీ తమిళం మరియు హిందీ లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు. రెండవ రోజు నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి కేవలం 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చింది.
ఓవరాల్ గా ఇది డీసెంట్ వసూళ్లే అయినప్పటికీ, నార్త్ ఇండియా లో సీక్వెల్స్ ట్రెండ్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న వేళ, ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు కాస్త తక్కువ అనే చెప్పాలి. ‘కాంతారా’ మొదటి భాగం నార్త్ ఇండియా లో ఆలస్యంగా విడుదలైనప్పటికీ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమాకు నార్త్ ఇండియా లో మొదటి రోజు నుండే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అని తెలుస్తుంది. ఇది మంచి వసూళ్లే అని చెప్పొచ్చు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వకపోగా, డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 9 మిలియన్ డాలర్లకు జరిగింది. కానీ కలెక్షన్స్ చూస్తే ప్రీమియర్స్ + మొదటి రోజు + రెండవ రోజు కలిపి కూడా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు అవ్వలేదు. శనివారం మరియు ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గొప్పగా లేవు, చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ చిత్రం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను అయినా రాబడుతుందా? అనే సందేహం లో ఉన్నారు ట్రేడ్ పండితులు. సూపర్ హిట్ టాక్ వస్తేనే ఇలా ఉందంటే, పొరపాటున ఫ్లాప్ టాక్ వచ్చునంటే ఏ రేంజ్ డిజాస్టర్ అయ్యి ఉండేదో అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది.