Kantara 2 Scam: దసరా కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతారా 2′(Kanthara : The Chapter 1) చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది, డొమెస్టిక్ మార్కెట్ లో బాగానే పెర్ఫార్మన్స్ ఇస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సినిమా విషయం లో నిర్మాతలు చేసిన కొన్ని ట్రిక్స్ కారణంగా కాంతారా చిత్రం అబాసుపాలైంది. సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు ఇప్పుడు ‘కాంతారా’ మేకర్స్ హోమబుల్ ఫిలిమ్స్ పై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే బుక్ మై షో యాప్ లో ఒక సినిమాకు గంటకి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అనే ఫీచర్ ఉంది. ఇది చాలా జెన్యూన్ అని అంతా అనుకున్నారు. కానీ దీనిని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అనే విషయం హోమబుల్ సంస్థ ద్వారానే తెలిసింది. మొదటి రోజు ఈ చిత్రానికి గంటకు 90 వేలకు టికెట్స్ అమ్ముడుపోతున్నట్టు బుక్ మై షో ఫీచర్ లో కనిపించింది.
ఆ రేంజ్ లో టికెట్స్ అమ్మకం జరిగిన సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద డొమెస్టిక్ మార్కెట్ నుండి కనీసం 130 కోట్ల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ అయినా రావాలి. కానీ ఈ చిత్రానికి కేవలం 89 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక్కడే కాంతారా మేకర్స్ అడ్డంగా దొరికిపోయారు. ఇక రెండవ రోజున తెలుగు, కన్నడ వెర్షన్స్ లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయి కానీ, మిగిలిన చోట్ల బుక్ మై షో యాప్ ని ఒకసారి పరిశీలిస్తే థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. టికెట్స్ అమ్ముడుపోవడం లేదు, అయినప్పటికీ కూడా బుక్ మై షో యాప్ లో గంటకు 60 వేలకు టికెట్స్ అమ్ముడుపోతున్నట్టు కనిపించింది. ఇక్కడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయలకు మించి గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
దీంతో సోషల్ మీడియా లో ట్రేడ్ ని బాగా విశ్లేషించేవాళ్లకు బుక్ మై షో లో టికెట్ సేల్స్ ని మేకర్స్ మ్యానిపులేట్ చేసారని, దీని కోసం ఒక టీం గట్టిగా పని చేస్తుందనే విషయాన్ని కనిపెట్టారు. కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు, గతం లో దేవర, గేమ్ చేంజర్ వంటి చిత్రాలకు కూడా ఇలాంటివి జరిగాయట. ఆడియన్స్ కి తమ సినిమా ఎంత గొప్పగా ఆడుతుందో అర్థం అయ్యేందుకు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం ఈమధ్య కాలం లో మేకర్స్ కి అలవాటు అయ్యిందని, కాబట్టి ఆడియన్స్ కాస్త అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.