Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మొదలై అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకొని, నాల్గవ వారం చివర్లోకి వచ్చేసింది. ఇప్పటికే హౌస్ నుండి శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్ మరియు ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అవుతూ రావడం తో వాళ్లకు జనాల నాడి అర్థమై ఆట తీరుని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీజ దమ్ము ఇప్పటికే తన ఆట తీరుని చాలా వరకు మార్చుకుంది. కానీ మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం ఇప్పటికే మారలేదు. ఈ వారం నూటికి నూరు శాతం ఆయనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా ఓటింగ్ లో కూడా చివరి స్థానం లో హరీష్ కొనసాగుతున్నాడు. అధికారిక ఓటింగ్ లో కూడా ఆయనే చివరి స్థానం లో ఉన్నట్టు టాక్. అయితే నిన్న ఒక్క ఎపిసోడ్ పూర్తిగా ఓటింగ్ గ్రాఫ్ ని మార్చేసింది.
నిన్న మొన్నటి వరకు మాస్క్ మ్యాన్ హరీష్ తో పాటు,దమ్ము శ్రీజ కూడా డేంజర్ జోన్ లో కొనసాగుతూ వచ్చింది. కానీ నిన్న ఒక్క ఎపిసోడ్ తో శ్రీజ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు ముఖ్య కారణం ఆమె పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా నిల్చుకోవడమే. పవన్ కళ్యాణ్ గత మూడు రోజుల నుండి కెప్టెన్సీ టాస్కు ని ఎంత అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడా మనమంతా చూసాము. కానీ ఆయన్ని రీతూ చౌదరి వెన్నుపోటు పొడుస్తూ డిమోన్ పవన్ చేత కెప్టెన్సీ టాస్క్ నుండి పక్కకి తొలగించేలా చేస్తుంది. శ్రీజ మాత్రం మొదటి నుండి పవన్ కళ్యాణ్ కోసం ఆడుతూ వస్తుంది. వెన్నుపోటు కి గురై రూమ్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు అతనికి అండగా నిల్చింది. ఓదార్చే ప్రయత్నం చేసింది. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఈమెకు ఓట్లు వేయడం మొదలు పెట్టారు.
దాంతో ఒక్కసారిగా ఆమె టాప్ 2 స్థానం లోకి వెళ్ళింది అంటూ విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. మొదటి స్థానం లో సంజన కొనసాగుతుండగా, రెండవ స్థానంలో దమ్ము శ్రీజ, మూడవ స్థానంలో రీతూ చౌదరి కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో దివ్య నిఖిత కొనసాగుతుండగా, ఐదవ స్థానం లోకి ఫ్లోరా షైనా వచ్చింది. వాస్తవానికి ఫ్లోరా షైనీ నిన్న మొన్నటి వరకు టాప్ 2 స్థానం లో ఉండేది. కానీ నామినేషన్స్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ నుండి మంచి కంటెంట్ రావడం తో ఫ్లోరా బాగా వెనుకపడింది. ఆమె కూడా చాలా కష్టపడి ఈ వారం ఆడింది, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. అందుకే డేంజర్ జోన్ లోకి వచ్చింది. కానీ ఫ్లోరా షైనీ మరియు మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య ఓటింగ్ తేడా చాలా పెద్దది అట. కాబట్టి ఈ వారం మాస్క్ మ్యాన్ హరీష్ బిగ్ బాస్ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడు.