Kannappa Teaser 2 Review: మోహన్ బాబు కొడుకు అయిన విష్ణు (Vishnu) ఇండస్ట్రీ కి ఏంటో ఇచ్చి 20 సంవత్సరాలు దాటుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన ఒక్క భారీ సక్సెస్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ (Kannappa) సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద బజ్ పెంచడానికి ఇందులో భారీ క్యాస్టింగ్ ను కూడా తీసుకున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి నటుడు ఈ సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్ లో నటిస్తుండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే రెండవ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం…
Also Read: రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!
కన్నప్ప టీజర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సినిమాలో ఒక వర్గానికి మరొక వర్గానికి మధ్య యుద్ధం జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. అలాగే తిన్నడు అనే ఒక నాస్తికుడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనే ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే టీజర్ ని మొదటి నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మనకు ఒక్క ఎంగేజింగ్ మూమెంట్ కూడా కనిపించడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఒకటి మీద ఒకరు దాడి చేస్తూ ఉన్నారు తప్ప ప్రేక్షకుడిని హుక్ చేసే పాయింట్ టీజర్ లో అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. ఇక టీజర్ మొత్తం చూస్తే ఒక బాలీవుడ్ సీరియల్ ని చూసినట్టుగా అనిపించింది తప్ప ఎక్కడా కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అనే ఫీల్ అయితే ఎక్కడా కనిపించలేదు.
మరి ఆ విజువల్స్ లోనే భారీగా లోపం అయితే కనిపిస్తుంది. ఇక మంచు విష్ణు యాక్టింగ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన డైలాగ్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. బాహుబలి (Bahubali) రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయాలని అనుకున్నారు.
కానీ దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనే విషయాన్ని గమనిస్తే మంచిది. ఈ సినిమా నుంచి శివుడు మీద వచ్చిన సాంగ్ ను మినహాయిస్తే మొదటి వచ్చిన టీజర్ గాని, ఈ టీజర్ గాని ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఇక ప్రభాస్ బ్యాక్ షాట్ ఒకటి అద్భుతంగా అనిపించింది. అలాగే ఆయన ఫేస్ ని రివిల్ చేసిన షాట్ కూడా చాలా బాగుంది.
ఈ రెండింటిని మినహాయిస్తే మిగతావన్నీ ఈ సినిమాకు భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా పెద్దగా కొత్తదనం అయితే కనిపించలేదు. ఇక శివుడి గెటప్ లో అక్షయ్ కుమార్ ఆర్టిఫిషియల్ గా అనిపించాడు తప్ప ఆయనను చూస్తే ఒక దేవుడిని చూసినా ఫీల్ అయితే కలగలేదు…
Also Read: ‘హరి హర వీరమల్లు’ అధికారికంగా వాయిదా పడినట్టే..ఖరారు చేసిన నిర్మాత..మరి విడుదల అయ్యేది ఎప్పుడు?
