HDFC and ICICI Banks : ఐసిఐసిఐ బ్యాంకు తాజాగా తమ బ్యాంకులో మూడు కోట్ల లోపు ఉన్న ఎఫ్డి లపై 20 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. మే 26 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్న సాధారణ పరులకు 6.85 శాతం వడ్డీ రేట్లు అలాగే సీనియర్ సిటిజెన్లకు 7.35 శాతం అత్యధిక వడ్డీ రేట్లు అందిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు తోపాటు ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఒక షాకింగ్ విషయం తెలిపింది. మనదేశంలోనే దిగ్గజ బ్యాంకులు అయినా హెచ్డిఎఫ్సి మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వరుసగా ఫిక్స్డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అది కూడా కేవలం ఒకసారి కాదు ఈ బ్యాంకులో వరుసగా ఎఫ్డి ల పై వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉన్నాయి.
Also Read : కేవలం 5 ఏళ్లలో రూ.14 లక్షలు పొందొచ్చు.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న సూపర్ డూపర్ పథకం ఇదే..
గతంలో ఆర్బిఐ రేపోరేట్ల తగ్గించిన సమయం నుంచి దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇప్పటివరకు మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. రీసెంట్ గా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మే 26వ తేదీన వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాటలోనే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంకు కూడా వడ్డీరేట్లలో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. రీసెంట్ గా ఈ బ్యాంకు ఏకంగా ఎంపిక చేసిన కాలవ్యవధులపై 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. మే 26వ తేదీ నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి.
అయితే ఈ నియమం కేవలం మూడు కోట్ల లోపు ఉన్న డిపాజిట్ లపై మాత్రమే వర్తిస్తుంది. సాధారణ పౌరులకు ఐసిఐసిఐ బ్యాంకు మూడు శాతం నుంచి 7.05 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటు ఇస్తుంది. సీనియర్ సిటిజెన్లకు అయితే ఐసిఐసిఐ బ్యాంకులో 3.5% నుండి 7.55 శాతం వరకు వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అయితే సాధారణ పౌరులకు మరియు సీనియర్ సిటిజన్స్ కి ఐసిఐసిఐ బ్యాంకులో ఇదే రేంజ్ లో గతంలో వడ్డీ ఇచ్చినప్పటికీ కూడా నిర్దిష్ట కాల పరిమితి పై రేట్ల తగ్గింపు జరిగింది. అనేక కాలవ్యవధులపై ఐసిఐసిఐ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 15 నెలల లోపు ఉన్న డిపాజిట్లపై 6.7% నుంచి వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గి 6.5 శాతానికి చేరుకుంది.