Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఈ సినిమాకు ఆయనే నిర్మాత కూడా. షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన ప్రభాస్(Rebel Star Prabhas) తో పాటు, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్(Akshay Kumar), మాలీవుడ్ నుండి మోహన్ లాల్(Mohanlal) వంటి ప్రముఖులు కూడా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది అనే ఆనందం లో ఉన్నాడు విష్ణు. ఈ చిత్రం నిడివి మూడు గంటల వరకు ఉంటుందని, ప్రభాస్ ఇందులో 30 నిమిషాల వరకు కనిపిస్తాడనే మంచు విష్ణు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇలా సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ప్రొమోషన్స్ చేస్తున్న ఈ కీలక సమయం లో ఒక సంచలన సంఘటన జరిగింది. ఇది మూవీ టీం మొత్తాన్ని ఆందోళనకు గురి చేస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ డిస్క్ మిస్ అయ్యిందట. ముంబై లోని ఒక ప్రముఖ VFX కంపెనీ తో ఈ చిత్రానికి సంబంధించిన VFX షాట్స్ అన్ని తయారు చేయించారు. ఆ కంపెనీ నుండి రీసెంట్ గానే ఆ షాట్స్ కి సంబంధించిన వర్క్స్ మొత్తాన్ని పూర్తి చేసి ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టి పంపించారు. ఈ హార్డ్ డ్రైవ్ మంచు విష్ణు ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్న రఘు అనే వ్యక్తి స్టాఫ్ లో ఒకరైన చరిత అనే అమ్మాయికి అప్పగించగా ఆమె పరారైనట్టు తెలుస్తుంది. ఈమేరకు ఫిలిం నగర్ పోలీసులకు కన్నప్ప ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా చర్చ నడుస్తుంది.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
200 కోట్ల రూపాయిల బడ్జెట్ కి సంబంధించిన సినిమా పట్ల ఇంత అజాగ్రత్తతో ఉంటే ఎలా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా జరిగిందా లేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా అనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ ఘటనపై మంచు మనోజ్ ని ఇరికించి రాజకీయం చేయబోతున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలల నుండి మంచు కుటుంబం లో జరుగుతున్న అంతర్గత గొడవలు గురించి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆ గొడవల్లో భాగంగానే ఈ సంఘటన జరిగిందా?, త్వరలోనే ఈ ఘటనపై పెద్ద డ్రామా చూడబోతున్నామా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మంచు కుటుంబం పట్ల నెటిజెన్స్ కి మొదటి నుండి సరైన అభిప్రాయం ఉండదు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ మంచు కుటుంబ వివాదం లో అత్యధిక శాతం మంది మనోజ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు.
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకొని పారిపోయిన ఆఫీస్ బాయ్ రఘు . పోలీస్ లకి ఫిర్యాదు చేసిన ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయకుమార్
— Telugu360 (@Telugu360) May 27, 2025