Kannappa Movie Controversy: ఒకప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మోహన్ బాబు ఒకరు. ఇప్పుడు ఆయన తన ప్రస్తుతం ఆయన తన కొడుకు అయిన మంచు విష్ణు(Vishnu) కన్నప్ప (Kannappa ) సినిమాలో నటిస్తున్నాడు. విష్ణు మొదటి నుంచి మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నప్పటికి ఒక్క డీ (Dhee) సినిమాను మినహాయిస్తే ఆయన చేసిన ఏ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేకపోయింది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజై భారీ వసూళ్లను కలెక్ట్ చేసి పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెడుతుంది అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక దానికి తోడుగా ప్రభాస్ ఇందులో ఒక పాత్ర చేయడం ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిల్వనుంది.
ప్రభాస్ పేరు మీదుగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మంచు విష్ణు మరోసారి తన స్టామినా ఏంటో చూపించి భారీ సక్సెస్ ని సాధిస్తాడా? తద్వారా తన మ్యానియాను కొనసాగిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది…ఇక పాన్ ఇండియాలో ఇప్పటికీ ఎవరికి సాధ్యం కాని రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటాడా?
లేదా అనే దాని మీదనే తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మంచి విష్ణు పెద్ద తప్పైతే చేశాడు. అదేంటి అంటే తెలుగులో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికి బాలీవుడ్ నుంచి ఒక దర్శకుడు ని తీసుకువచ్చి ఆయనకి ఆఫర్ అయితే ఇచ్చాడు. ఇక మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దర్శకుడిని కూడా పక్కన పెట్టి దాదాపు చాలా సీన్లను మంచు విష్ణు డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.నిజానికి యాక్టింగ్ చేస్తు డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్…
ఒక రకంగా డైరెక్షన్ యాక్టింగ్ రెండు చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది మరి ఈ రెండు క్రాఫ్ట్ లను సక్సెస్ ఫుల్ గా చేశాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మరికొంతమంది సినిమా మేధావులు సైతం భారీ బడ్జెట్ తో సినిమా చేసినప్పుడు ఒక మంచి దర్శకుడిని పెట్టుకొని ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…