Kannappa : మంచు(Manchu Mohan Babu) కుటుంబంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వివాదాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మనోజ్(Manchu Manoj), విష్ణు(Manchu Vishnu) ల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానంత అయ్యింది. మంచు విష్ణు మనోజ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, మనోజ్ ఇప్పటి వరకు విష్ణు ఎన్నో సంచలన ఆరోపణలు చేసాడు. ఇది ఇలా ఉండగా నేడు కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ పోయిందంటూ వచ్చిన ఒక వార్త ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ అంశం గురించే చర్చ. ముంబై కి చెందిన ఒక VFX సంస్థ ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రానికి సంబంధించిన VFX షాట్స్ మొత్తం పూర్తి చేసి ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టి పంపారని, దానిని రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయి కి ఇవ్వగా, ఆమె ఆ హార్డ్ డిస్క్ తీసుకొని ప్రరారైందనే వార్త వినిపించింది. అయితే మంచు విష్ణు వర్గం ఈ కుట్ర వెనుక మంచు మనోజ్ హస్తం ఉందని అంటున్నారు.
రఘు అనే వ్యక్తి మనోజ్ కి PA అని, చరిత అనే అమ్మాయి కూడా మనోజ్ ఆఫీస్ లో పని చేస్తుందని, కచ్చితంగా హార్డ్ డిస్క్ మాయం వెనుక మనోజ్ హస్తం ఉందని, చాలా కాలం నుండి కన్నప్ప చిత్రాన్ని ఆన్లైన్ లో లీక్ చేస్తామంటూ మనోజ్ వర్గం బెదిరిస్తుందని, 45 రోజుల క్రితం ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి కొరియర్ ద్వారా విష్ణు ఇంటికి వచ్చిన హార్డ్ డ్రైవ్
పార్శిల్ ను సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ పీఏ, అసిస్టెంట్ అడ్డుపడ్డారని అంటూ విష్ణు వర్గం ఆరోపణలు చేస్తుంది. ఆ హార్డ్ డిస్క్ లో సుమారుగా గంటన్నర సినిమా ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
అయితే ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టుగా సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్డ్ డిస్క్ మిస్ అయ్యింది అనే వార్త వచ్చినప్పుడే, కచ్చితంగా ఇది మనోజ్ చెయ్యించాడంటూ మంచు విష్ణు పబ్లిసిటీ చేయిస్తాడని ముందే ఊహించినట్టుగా సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. అయితే మనోజ్ ప్రస్తుతం తన ‘భైరవం’ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 30 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఒక పక్క ఆయన ఆ సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా ఉంటే, ఇంత పెద్ద కుట్ర కి తెర తీసే సమయం ఎక్కడ దొరుకుంటుందని మంచు మనోజ్ మద్దతుదారులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మనోజ్ రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం..
24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు నమోదు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకొని పారిపోయిన ఆఫీస్… pic.twitter.com/mMS5ZqEuSl
— ChotaNews App (@ChotaNewsApp) May 27, 2025