Hero Darshan: గత కొంతకాలంగా బెంగళూరు పరప్పన జైలులో ఉంటున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్(Darshan) ఇప్పుడు మరో వివాదం లో చిక్కుకున్నాడు. తన అభిమాని రేణుక స్వామిని (Renuka Swamy) ఆయన మనుషులు హత్య చేయించారు అనే ఆరోపణలతో దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత కాలం బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ని, బెయిల్ గడువు తీరిపోయిన వెంటనే మళ్లీ అరెస్ట్ చేశారు., ఈ నెల 12 న ఆయన హీరో గా నటించిన ‘డెవిల్’ చిత్రం విడుదల కాబోతుంది. కానీ దర్శన్ మాత్రం జైలులోనే ఉన్నాడు. జైలు లో ఉండగానే ఆయన్ని మరో వివాదం చుట్టుముట్టేసింది. రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి అనుకుమార్, జగ్గా, ప్రడ్యూస్ మరియు లక్ష్మణ్ లు హీరో దర్శన్ మమ్మల్ని వేధిస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు చెప్పుకొచ్చారు.
దీంతో పోలీస్ స్టేషన్ లో దర్శన్ బ్యారక్ వద్ద కాస్త బందోబస్తుని పటిష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలు ఉండడం తో దర్శన్ తనని తానూ కాపాడుకోవడానికి కచ్చితంగా తమ వైపుకు వస్తాడని, మాకు ఆయన నుండి, ఆయన అనుచరుల నుండి ప్రాణహాని ఉందని అంటున్నారు. ఈ వ్యవహారం లో దర్శన్ ని పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఆయన హీరో గా నటించిన ‘డెవిల్’ చిత్రం విడుదల కాబోతుండడం తో రేపటి నుండి కర్ణాటక రాష్ట్రము లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శన్ మొదటి నుండి కర్ణాటక లో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. ఇప్పుడు ఆయన జైలు పాలు అవ్వడం తో ఆయన అభిమానుల్లో మరింత కసి పెరిగింది. కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది కర్ణాటక లో ‘కాంతారా 2’ చిత్రం ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ ని సాధించింది. ఆ రేంజ్ ఓపెనింగ్స్ కాకపోయినా, కచ్చితంగా టాప్ 2 రేంజ్ ఓపెనింగ్ మాత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.