SS Rajamouli: రాజమౌళి స్థూలంగా క‌థను వివరించేశాడు !

SS Rajamouli: ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ ట్రైల‌ర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాని ఎలేస్తోంది. మరి ట్రైలర్ ఎలా ఉంది ? అని అగడటం అనవసరం. కాకపోతే, ట్రైలర్ లో ఏమి ఉన్నాయో ? ఎలాంటి అంశాలను హైలైట్ చేశారో చూద్దాం. ఎప్పటిలాగే రాజమౌళి ప్ర‌తీ సీన్ ను బాగా ఎలివేట్ చేశాడు. అలాగే ప్రతి షాట్ ను బాగా చూపించాడు. ఇక ఎలివేషన్స్, హీరోయిజాలు విషయానికి వస్తే.. ప్రతి ఎక్స్ ప్రెషన్ ఓ క్లైమాక్స్ లానే ఉంది. పాన్ ఇండియా […]

Written By: Shiva, Updated On : December 9, 2021 4:46 pm
Follow us on

SS Rajamouli: ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ ట్రైల‌ర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాని ఎలేస్తోంది. మరి ట్రైలర్ ఎలా ఉంది ? అని అగడటం అనవసరం. కాకపోతే, ట్రైలర్ లో ఏమి ఉన్నాయో ? ఎలాంటి అంశాలను హైలైట్ చేశారో చూద్దాం. ఎప్పటిలాగే రాజమౌళి ప్ర‌తీ సీన్ ను బాగా ఎలివేట్ చేశాడు. అలాగే ప్రతి షాట్ ను బాగా చూపించాడు. ఇక ఎలివేషన్స్, హీరోయిజాలు విషయానికి వస్తే.. ప్రతి ఎక్స్ ప్రెషన్ ఓ క్లైమాక్స్ లానే ఉంది.

SS Rajamouli

పాన్ ఇండియా సినిమా అంటే ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో చాటి చెప్పిన సినిమా ‘ఆర్.ఆర్‌.ఆర్‌’. ఒక సినిమా కోసం అసలు దేశం మొత్తం ఆస‌క్తితో ఎదురు చూస్తుందా ? కానీ జ‌న‌వ‌రి 7 కోసం భారతీయ సినీ జగత్తు మొత్తం ఎదురుచూస్తోంది. ట్రైల‌ర్ లో డైలాగులు, ఎమోష‌న్స్‌, విజువ‌లైజేష‌న్స్ చూశాకా, సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆత్రుత పెరిగింది.

మొత్తం 3 నిమిషాల 15 సెక‌న్ల ట్రైల‌ర్‌ లో స్థూలంగా క‌థను అయితే రాజమౌళి వివరించాడు. భీమ్.. బ్రీటీష్ వాళ్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంటే.. రామ్‌.. భీమ్ ని ప‌ట్టుకోవ‌డానికి రంగంలోకి దిగి ఏమి చేశాడు ? అనేది కథలోని మెయిన్ అంశం. ఇక ఇదంతా జరగకముందే రామ్ – బీమ్ ఇద్ద‌రూ స్నేహితులు. ఆ స్నేహం పోయి చివరకు వైరం మిగులుతుంది.

అయితే, ఆ వైరం ప్లేస్ లో మ‌ళ్లీ స్నేహం ఎలా వచ్చి చేరింది అనేది మెయిన్ ఎమోషన్. అయితే, ట్రైలర్ ను ఓపెన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది.

స్కాట్ దొర వారు.. మా అదిలాబాద్ ఓచ్చిన‌ప్పుడు ఓ చిన్న పిల్ల‌ను తీసుకొచ్చిండ్రు.. మీరు తీసుకొచ్చినాది.. ఓ కోన పిల్ల‌నండీ.
అయితే.. వాళ్లకేమైనా రెండు కొమ్ములుంటాయా?
ఒక కాప‌రి ఉంటాడు అండి.

Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మీద సినీ ప్రముఖుల స్పందన.. రాజమౌళికి ‘టేక్ ఏ బౌ’..

అని డైలాగ్ పూర్తి అవ్వగానే.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో భీమ్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌ వస్తోంది. పులితో వేటాడుతున్న కొమ‌రం భీమ్ ని.. పులి కంటే రౌద్రంగా చూపించి మొత్తానికి ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను రాజమౌళి ఈ రకంగా తీర్చుకున్నాడు.

ఇక ఆ పులిని ప‌ట్టుకోవ‌డానికి వేట‌గాడు కావాలి. ఆ ప‌ని చేయ‌గ‌లిగేది ఒక్క‌డే సార్‌…

అనే డైలాగ్ పూర్తి అవ్వగానే.. చ‌ర‌ణ్ యాక్షన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత రామ్- భీమ్ ల మధ్య ఎమోషన్స్ ను హైలైట్ చేశాడు రాజమౌళి. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ సినిమా పక్కా ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అయిపోతుంది.

Also Read: ముంబయిలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​ కోసమే

Tags