Actor Shankar Rao: చిత్ర పరిశ్రమలో వరుసగా నటులు మరణించడం ఇటీవల చూస్తూనే ఉంటున్నాం. కాగా కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ కమెడియన్ శంకర్ రావు తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ల శంకర్ రావు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వందకు పైగా చిత్రాలలో శంకర్ రావ్ నటించారు.

కన్నడలో పాపులర్ స్టార్స్ అయిన విష్ణు వర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, దర్శన్… వంటి హీరోల చిత్రాలలో ప్రముఖ పాత్రలలో అలరించారు. స్టేజ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ రావ్ వెండితెర ఎంట్రీ ఇచ్చారు. యారా సాక్షి’ సినిమాతో శాండల్‌వుడ్ అరంగేట్రం చేసిన శంకర్ రావు.. బెస్ట్ కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నారు.
సీరియల్ నటుడిగా బుల్లితెర ప్రేక్షకులను కూడా శంకర్ రావ్ అలరించారు. ‘అలాగే… మాయ మృగ’, ‘సిల్లీ లల్లీ’ మరియు ‘పాపా పాండు’ వంటి ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో కూడా కనిపించారు. శంకర్ రావ్ మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వారి సంఘీబావాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.