Kangua Movie Collections : తమిళ హీరో సూర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, సుమారుగా మూడేళ్ళ సమయాన్ని కేటాయించి, నటించిన చిత్రం ‘కంగువా’. నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్ తో ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత మాత్రం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. ఈ డిజాస్టర్ టాక్ ప్రభావం సినిమా మీద మామూలు రేంజ్ లో పడలేదు. కచ్చితంగా మొదటి రోజు 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుంది అనుకున్న ఈ సినిమా, కేవలం 40 కోట్ల గ్రాస్ వద్ద ఆగిపోయింది. కొన్ని అనుకోని కారణాల వల్ల అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా తక్కువ థియేటర్స్ లో విడుదల కావాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇక డిజాస్టర్ టాక్ వస్తే ఓపెనింగ్స్ తక్కువ రావడం సహజమే.
ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి..?, తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత రాబట్టింది..?, ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటిరోజు 6 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకోవాలంటే కచ్చితంగా 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే అది అసాధ్యం అనే చెప్పాలి. ఫుల్ రన్ లో 12 నుండి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే, తమిళనాడు లో ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం 11 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సూర్య రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.
ఒకపక్క శివ కార్తికేయన్ ‘అమరన్’ చిత్రానికి అద్భుతమైన థియేట్రికల్ రన్ ఉండడంతో కంగువా కి తమిళనాడు లో కేవలం 50 శాతం థియేటర్స్ మాత్రమే దొరికాయట. దానికి తోడు టాక్ కూడా లేకపోవడం ఇంత తక్కువ ఓపెనింగ్ ని దక్కించుకుంది. అదే విధంగా కర్ణాటక రెండు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 3 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 11 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను, 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 180 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా లేవు.