https://oktelugu.com/

బి-గ్రేడ్ హీరోయిన్ బాగోతాలు పట్టించుకోను – కంగనా

వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ కి, పబ్లిసిటీ బ్యూటీ తాప్సికి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కంగనా దృష్టిలో తాప్సి జూనియర్ ఆర్టిస్ట్ కి కాస్త ఎక్కువ. పైగా తనని కాపీ కొట్టడానికి తెగ ఉబలాట పడుతున్న చీప్ మైండ్ సెట్ ఉన్న ఆర్టిస్ట్ అని అభిప్రాయం. అందుకే అవకాశం లేకపోయినా అప్రస్తుతం గానైనా తాప్సిని ‘బి-గ్రేడ్ భామ’ అంటూ తన కసిని మనస్ఫూర్తిగా తీర్చుకుంటూ ఉంటుంది కంగనా. మరి కంగనా తాప్సిని ఇంతగా […]

Written By:
  • admin
  • , Updated On : June 30, 2021 / 05:04 PM IST
    Follow us on

    వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ కి, పబ్లిసిటీ బ్యూటీ తాప్సికి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కంగనా దృష్టిలో తాప్సి జూనియర్ ఆర్టిస్ట్ కి కాస్త ఎక్కువ. పైగా తనని కాపీ కొట్టడానికి తెగ ఉబలాట పడుతున్న చీప్ మైండ్ సెట్ ఉన్న ఆర్టిస్ట్ అని అభిప్రాయం. అందుకే అవకాశం లేకపోయినా అప్రస్తుతం గానైనా తాప్సిని ‘బి-గ్రేడ్ భామ’ అంటూ తన కసిని మనస్ఫూర్తిగా తీర్చుకుంటూ ఉంటుంది కంగనా.

    మరి కంగనా తాప్సిని ఇంతగా ఈసడించుకుంటున్న విషయం తాప్సి అసలు జీర్ణయించుకోలేకపోతుంది. మొత్తానికి చాలా కాలంగా వీరి మధ్య ఈ రగడ ఈ రచ్చ ఆనవాయితీ అన్నట్టు జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా వీరి మధ్య మళ్ళీ మాటల తూటాలు పేలాయి. తాప్సి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇస్తే ఇచ్చింది, తన స్థాయికి స్టార్ డమ్ కి మించిన మాటలు మాట్లాడింది.

    ‘కంగనాకి నా లైఫ్ లో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వను. అసలు ఆమె గురించి చర్చ కూడా వేస్ట్. అంటూ కంగనా గురించి మాట్లాడటానికి కూడా ఇష్టం లేనట్టు తాప్సి హొయలు పోయింది. మరి ఇక ఇది చూశాక సైలెంట్ గా ఉండటానికి కంగనా రెగ్యులర్ హీరోయిన్ కాదు కదా, డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్. ఒక్క మాట అంటే వంద మాటలు అంటుంది. ఆ విధంగా కంగనా మళ్ళీ రెచ్చిపోయింది.

    తాప్సిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పబ్లిసిటీ కోసం నా గురించి కామెంట్స్ చేసే బి-గ్రేడ్ హీరోయిన్ల బాగోతాల గురించి నేను పట్టించుకోను. కాకపోతే, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను చిన్నగా చేసి, పెద్దోళ్ళం అయిపోవాలనుకునే అత్యాశను స్వభావాన్ని కచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలి’ అంటూ పనిలో పనిగా తనది పెద్ద స్థాయి అని, తాప్సిది చిన్న స్థాయి అని కంగనా ఘాటుగా చెప్పుకొచ్చింది.