Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఫైర్‌బ్రాండ్. సినిమాల పరంగా ఆమె ఎంత ఫేమస్సో … అలానే ఆవిడ చేసే పనుల ద్వారా కూడా అంతే ఫేమస్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా అండమాన్, నికోబార్ దీవులలో కంగనా పర్యటించారు. ఈ సందర్భంగా అండమాన్ జైలులోని… స్వాతంత్య్ర వీరుడు సావర్కర్ ఉన్న జైలుగదిని సందర్శించారు. ఈ మేరకు సావర్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి… ఆ ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర మరువలేనిది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలానే ఈయన అన్న గణేష్ దామోదర్ సావర్కర్ కూడా కాలాపానీ జైలు జీవితం గడుపుతూ తుదిశ్వాస విడిచారు. వినాయక్ సావర్కర్… స్వతంత్య్ర వీర్‌గా పేరు గాంచారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో… భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్య్ర వీరులు కూడా వీర్ సావర్కర్ కు ఏకలవ్య శిష్యులు వంటివారు. సావర్కర్ ఆ తర్వాత హిందూ మహా సభను కూడా స్థాపించారు.
ఇక కంగనా రనౌత్ ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలలో ఆమె నటనకు గాను 2019 సంవత్సరానికి ఆ అవార్డును అందజేయడం జరిగింది. అలానే దివంగత సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’ లో కంగనా… జయలలిత పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన… ఓటీటీలో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. కంగనా రనౌత్ తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ధాకడ్’, ‘తేజస్’ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు నిజ జీవిత గాథలపై తెరకెక్కుతున్నాయి.
