https://oktelugu.com/

సుశాంత్ మృతిపై కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. చిత్రసీమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు సుశాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా స్పందించింది. సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణమని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివిగల వీడియోను కంగనా తన ఇన్ స్ట్రాలో పోస్టుచేసింది. కంగనా పోస్టుకు అభిమానులు పెద్దఎత్తున మద్దతు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 15, 2020 / 09:06 PM IST
    Follow us on


    బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి బాలీవుడ్లో విషాదాన్ని నింపింది. చిత్రసీమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు సుశాంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా స్పందించింది. సుశాంత్ మృతికి బాలీవుడ్ పెద్దలే కారణమని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివిగల వీడియోను కంగనా తన ఇన్ స్ట్రాలో పోస్టుచేసింది. కంగనా పోస్టుకు అభిమానులు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    సుశాంత్ చాలా అద్భుతమైన నటుడని కంగనా కితాబిచ్చింది. ‘కైపోచె’ సినిమాకు బెస్ట్ డెబ్యూ అవార్డు రావాల్సి ఉందని కానీ అవార్డు రానివ్వకుండా చేశారని ఆరోపించింది. ‘చిచ్చోరే’ వంటి సందేశాత్మక చిత్రం కూడా చేశాడు. అంతటి టాలెంటెడ్ యాక్టర్‌కు అవార్డు రాకపోవడం ఏంటి.? స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ సంపాదించిన వ్యక్తి మానసికంగా ఎలా బలహీనంగా ఉంటాడని ఆమె ప్రశ్నించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని కంగనా రనౌత్ ఫైరయ్యారు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేస్తే వాళ్ళను ఎదగనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేసింది.

    పక్కా ప్లాన్ ప్రకారంగా బాలీవుడ్లో బడా సెలబెట్రీలు సుశాంత్ సుసైడ్ చేసుకోవడానికి కారణమయ్యరని వాపోయింది. వీరంతా కొత్తగా ఇండస్ట్రికి వచ్చేవారిని ప్రోత్సహించకపోగా వెనక్కి లాగుతుంటారని చెప్పింది. అలాగే బ్యాడ్ రివ్యూస్ రాయించి కెరీర్‌ను తొక్కేస్తారని విమర్శించింది. సుశాంత్‌ను డ్రగ్ బానిసగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఒకనొక సమయంలో సంజయ్ దత్ పరిస్థితి కూడా బాలీవుడ్ పెద్దల వల్ల దయనీయంగా ఉండేదని చెప్పింది. చివరకు ఆయన తన సినిమాలను చూడమని అభిమానులకు విజ్ఞప్తి చేశారని తెలిపింది. ఆఖరికి తనపై కూడా ఆరు కేసులు బనాయించారని కంగనా మండిపడింది. బాలీవుడ్ పెద్దల ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కంగనా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.