Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా సౌత్ ఇండస్ట్రీ పై, సౌత్ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘దక్షిణాది ప్రజలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు. వారు తమ కుటుంబాలను ప్రేమిస్తారు. వారి సంబంధాలు సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. వాళ్ల ప్రొఫెషనలిజం, ప్యాషన్ అసమానం. అలాంటి ఇండస్ట్రీలోకి బాలీవుడ్ స్టార్లను అనుమతించి తమ ఇండస్ట్రీని కలుషితం చేసుకోవద్దు’ అని కంగనా పేర్కొన్నారు. ఈ మేరకు పుష్ప, కేజిఎఫ్ పోస్టర్లు షేర్ చేసింది.

మొత్తానికి కంగనాకి సౌత్ హీరోల పై ప్రేమ పుట్టుకొచ్చింది. అసలు కంగనా రనౌత్ నోరు తెరిస్తే బూతు సువాసనలే వస్తాయి. ఈ విషయాన్ని ఆమె బాధితులు నిత్యం తలా బాదుకుంటూ వెల్లడిస్తూ ఉంటారు. అసలు కంగనా అంటేనే వివాదం.. ఎప్పుడు ఆమె చుట్టూ వంద వివాదాలు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. అయితే, ఈ మధ్య ఈ బూతుల మహారాణి ఉన్నట్టు ఉండి సౌత్ హీరోల పై పాజిటివ్ కామెంట్స్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేసింది.
Also Read: ఏప్రిల్ 28న ‘ఆర్ఆర్ఆర్’ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా? ఆ డేట్ వెనుక పెద్ద కథ?

మరోపక్క కంగనా యాంటీ బ్యాచ్ మొత్తం ఆమె ఈ కామెంట్స్ చేయడానికి కారణం.. ఛాన్స్ ల కోసం అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పైగా కంగనాను హిందీ ద్రోహిగా చిత్రీకరించడానికి నానాపాట్లు పడుతున్నారు. అయితే, అయినా కంగనా గురించి, ఆమె వ్యాఖ్యలు గురించి తెలిసిందే కదా, ఇక ఆమెను పట్టించుకోవడం దేనికి ? ఏది ఏమైనా కంగనా లాంటి దిగువస్థాయి నటి సౌత్ హీరోల పై ప్రేమను కురిపించినా వచ్చేది ఏమి లేదు అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: త్వరలోనే మీరు కోలుకోవాలి సర్ – మెగాస్టార్ చిరంజీవి